Breaking News Live Telugu Updates: రేపు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపింది. రేపు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వికారాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవుప్రకటించారు జిల్లా విద్యాశాఖ అధికారులు.
Mohan Babu Meets Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ నటుడు మోహన్ బాబు మంగళవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు రెండు గంటల పాటు సమావేశంలో అయ్యారు. ఏపీ రాజకీయాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
MMTS Rail Accident : హైదరాహబాద్ హైటెక్ సిటీ వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఎమ్ఎమ్టీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వనపర్తి వాసులుగా తెలుస్తోంది. రైలు ట్రాక్ వెంబడి నడుస్తుండగా వెనుక నుంచి రైలు ఢీకొట్టింది. మృతులు కృష్ణ, శ్రీను, రాజప్పగా సమాచారం.
తెలుగు నిర్మాతల గిల్డ్ అత్యవసర సమావేశం. ఆగస్టు నుంచి షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయం. ఈ నిర్ణయంతో పెద్ద హీరోల సినిమాలపై ప్రభావం. ఆగిపోనున్న పెద్ద హీరోల సినిమాలు.
తెలుగు నిర్మాతల గిల్డ్ అత్యవసర సమావేశం. ఆగస్టు నుంచి షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయం. ఈ నిర్ణయంతో పెద్ద హీరోల సినిమాలపై ప్రభావం. ఆగిపోనున్న పెద్ద హీరోల సినిమాలు.
గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష ప్రారంభం అయింది. ఈ దీక్షలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి, కోశాధికారి సుదర్శన్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అనిల్ యాదవ్, అజ్మతుల్లా హుసేన్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు పాల్గొన్నారు.
- కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజవర్గంలోని గంటి పెదపూడి రేవు నుంచి వసిష్ఠ నదిలో పంటులో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
- ఇక్కడ నుంచి నేరుగా ఇదే నియోజకవర్గంలోని పుచ్చకాయల వారి పేటకు వెళ్లి వరద బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి
- ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జోగి రమేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా తదిరులు
పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగులు ఆన్లైన్ జూదాలకు పాల్పడుతూ మట్కా పేకాట లాంటి వ్యసనాలకు బానిసలై అప్పులపాలై అర్ధాంతరంగా తనువును చాలిస్తున్న ఘటనలు ప్రజల్ని కలింపజేస్తున్నాయి. యువత పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనిస్తూ తల్లిదండ్రులు కూడా చెడు మార్గాన్ని ఎంచుకోకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పులివెందుల అంకాలమ్మపేటలో యువకుడు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలై అర్ధాంతరంగా తను చాలించగా సింహాద్రిపురం మండలంలో నిన్న కొత్తపల్లి గ్రామంలో.. అర్ధాంతరంగా తనవు చాలించారు.
- నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం
- వేలంలో పాల్గొననున్న జియో, ఎయిర్‌టెల్, అదానీ గ్రూప్
- ప్రస్తుత ఇంటర్నెట్ కంటే 10 రెట్లు వేగంగా డేటా సేవలు అందించనున్న 5జీ స్పెక్ట్రమ్
- కొనుగోలు చేసిన సంస్థలు 20 ఏళ్ల పాటు సేవలను వినియోగించుకునే అవకాశం
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు గారు హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు విజయవాడలో జరగబోయే దళిత గర్జన ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తుగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్క దారి పట్టించి, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి, దళితులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం, దళితుల హక్కులను హరిస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రశ్నించకుండా దళిత నాయకుల ను హౌస్ అరెస్ట్ చేసి నోరు నొక్కేయడం అన్యాయమని ఆయన అన్నారు. పోలీసుల తీరును నక్కా ఆనంద బాబు తీవ్రంగా ఖండించారు.
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో చల్లనిగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో పిడుగులు పడే పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తేలికపాటి జల్లులు పడతాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -