Breaking News Live Telugu Updates: దంతేవాడలో పేలిన మావోయిస్టులు మందుపాతర - 11 మంది పోలీసులు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Apr 2023 10:09 PM

Background

ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి పశ్చిమ విధర్బలోని ఆవర్తనం నుండి మరత్వాడ మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు....More

విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం

విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. పెందుర్తి పరిధిలో తిరుమల హాస్పిటల్ లో బాధితులు వినయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి వైద్యులు కిడ్నీ తీసుకున్నారు. చివరికి సీన్ రివర్స్ అయి పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. కిడ్నీకి 8.50 లక్షలు ఇస్తామంటూ కామరాజు అనే వ్యక్తి, శ్రీను అనే మరొకరు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారంగానే కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు బాధితుడు వినయ్ కుమార్. 
కలెక్టర్ ఆఫీస్ సమీపంలో విజయ మెడికల్ లేబ్ లో వినయ్ కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తరువాత వినయ్ కు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులు కామరాజు, శ్రీనులు పరారీలో ఉన్నట్లు సమాచారం.