Breaking News Live Telugu Updates: విద్యుదాఘాతానికి గురైన మూడేళ్ల దర్శిత్ మృతి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Nov 2022 07:31 PM

Background

ఈ నెలాఖరులోపు ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండం అవుతుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి...More

విద్యుదాఘాతానికి గురైన మూడేళ్ల దర్శిత్ మృతి 

కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మూడేళ్ల దర్శిత్ మృతి చెందాడు. ఈ నెల 12న విద్యుదాఘాతానికి గురైన బాలుడు తన రెండు కాళ్లు కోల్పోయాడు. తాళ్లపూడి మండలం పైడిమట్ట గ్రామానికి చెందిన దర్శిత్ ఇటీవల విద్యుత్ షాక్ గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం దర్శిత్ కుటుంబ సభ్యులను  హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. దర్శిత్ మృతితో తల్లి తండ్రులు వినోద్, చాందిని, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.