Breaking News Live Telugu Updates: సిద్దిపేటలో లారీ ఢీకొనడంతో సీనియర్ అడ్వకేట్ మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
లారీ డ్రైవర్ వేగానికి ప్రాణాలు కోల్పోయిన సీనియర్ అడ్వకేట్..
ఈరోజు సాయంత్రం సమయంలో సిద్ధిపేట లోని ముంద్రాయి కి చెందిన సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి తన బైక్ పై వెళుతుండగా రంగధాంపల్లి అమరవీర స్తూపం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ని ఢీ కొట్టింది.. తీవ్ర గాయాల పాలైన దశమంతరెడ్డి సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలారని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకు తరలించారు విషయం తెలిసిన న్యాయవాదులు సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో పది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పది రోజుల క్రితమే 20 మంది విద్యార్థినులు హాస్టల్లో.. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం మరవక ముందే.. కలుషిత ఆహారం తిని మళ్లీ కడుపునొప్పితో విద్యార్థినులు శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవలు కారణంగానే.. ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోని విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరో పక్క రెండు వర్గాల సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థినులపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని బండి సంజయ్ తెలిపారు.
బైక్, ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని తొర్రూరు మండలంలోని సోమారం గ్రామంలో బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులు చిరుత పులి సంచారంతో విద్యార్ధులు హడలి పోతున్నారు. ఇటీవల్ల ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ బంగ్లాలో ప్రవేశించిన చిరుత ఓ కుక్కను ఎత్తుకెళ్ళి చంపి తినడంతో యూనివర్సిటీలో హాస్టల్స్ లో ఉండే విద్యార్ధని, విద్యార్ధులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే యూనివర్సిటీలో చిరుత పులి సంచారం సంబంధించిన సీసీ పుటేజ్ వీడియోలను అటవీ శాఖా అధికారులకు తెలియజేయడంతో గత శుక్రవారం చిరుత పులి సంచరించే వీసీ బంగ్లా వెనుక వైపు చిరుత పులి కోసం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం ఉదయం చిరుతపులి అటవీశాఖ అధికారుల బోనుకు చిక్కింది. అయితే చిరుత పులి కోసం రెండు వేర్వేరు ప్రదేశాల్లో బోన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 6 కెమెరా ట్రప్పులను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి నుంచి చిరుత పులి కోసం అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆదివారం ఉదయం బోన్ లో బంధించారు. చిక్కిన చిరుత పులిని దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీ శాఖా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక చిరుత పులి సంచారంతో తిరుపతి రూరల్ మండలంమైన లక్ష్మీపల్లె, పెరుమాళ్ పురం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. శేషాచల అటవీ ప్రాంతంకు దగ్గరలో గ్రామాలు ఉండడంతో తరచూ రాత్రి సమయాల్లో చిరుత పులి గ్రామాల్లో సంచరించి కుక్కలను వేటాడి చంపితింటొంది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి తమకు రక్ష కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Background
ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. దీనివల్ల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 400 కిలో మీటర్ల దూరంలో, నాగపట్టినంకు తూర్పుగా 470 కిలో మీటర్లు (తమిళనాడు), చెన్నై (తమిళనాడు)కి తూర్పు ఆగేయంగా 500 కిలో మీటర్లకు సమీపంలో కేంద్రీకృతం అవుతోంది.
ఆ తర్వాత పశ్చిమ నైరుతి దిశగా కదిలి 25న ఉదయం శ్రీలంక తీరానికి చేరుకుంటుంది. తర్వాత శ్రీలంక మీదుగా పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఆదివారం (డిసెంబర్26) ఉదయం నాటికి కొమోరిన్ ప్రాంత పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతోపాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
‘‘మొత్తానికి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రారంభం అవ్వనున్నాయి. నిన్న చెన్నైలో కురిసిన వర్షాలు ఇప్పుడు నేరుగా మన ఆంధ్రా వైపుగా వస్తున్నాయి. దీని వలన మరో మూడు గంటల వరకు దక్షిణ జిల్లాలలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడనుంది, అలాగే ఒకటి లేదా రెండు చోట్లల్లో మోస్తరు వర్షాలుంటాయి. ఇంక తెల్లవారి అయ్యేసరికి కొంచెం విస్తారంగా పడతాయి. దీని నుంచి భారీ వర్షాలుంటాయి అని అనుకోకండి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,380 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,850 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,380 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -