Breaking News Live Telugu Updates: నిరుద్యోగ ర్యాలీనీ జయప్రదం చేయండి టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Apr 2023 09:10 PM
నిరుద్యోగ ర్యాలీనీ జయప్రదం చేయండి టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ 

నిరుద్యోగ ర్యాలీనీ జయప్రదం చేయండి


టీ- పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ 


ఈనెల 26న అదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీ-పీసీసీ రాష్ట్ర అద్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలని టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో బీఅర్ఎస్ ప్రభుత్వం నిరోద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. నీళ్ళు, నిధులు, నియమాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరోద్యోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. నిరుద్యోగులకు బరోసా కల్పించడానికి అండగా నిలవడానికి టీ-పీసీసీ రాష్ట్ర అద్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండీ కాంగ్రెస్ నాయకులు, రైతులు, విద్యార్థినిలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు,పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో టీ-పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ బొజ్జు పటేల్, మైనార్టీ రాష్ట్ర నాయకులు జావేద్ ఆక్రమ్, మండల అధ్యక్షులు దూట రాజేశ్వర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు కనక తూల్సిరం, మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ సలీం, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోత్ జైవంత్ రావు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు అచ్ఛ దేవానందం, సీనియర్ నాయకులు ఖయ్యూంఖాన్, సయ్యద్ నిసార్, రాజగౌడ్, బొడ్డు తిరుపతి, మోబిన్, తదితరులు పాల్గొన్నారు.

సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలన్న సీఎం


అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సుడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే… వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకుని అక్కడనుంచి స్వస్థలాలకు చేరుకునే వారకూ కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.

చెంపదెబ్బను బాంబులు వేసినట్లు చిత్రీకరించారు: షర్మిల ఫైర్

వై ఎస్ షర్మిల చంచల్ గూడ జైలు 


కే సి ఆర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు. 


సిట్ వెళ్లి రిప్రసెంటాషన్ ఇవ్వాలని అనుకున్నాను 
 
కావాలనే పోలీస్ లను పెట్టీ నన్ను అరెస్ట్ చేశారు 


ఇద్దరు మహిళ. పోలీస్ మాత్రమే ఉన్నారు. 


మహిళా అని చూడకుండా నా మీద పడి దాడి చేశారు. 


ఇంటికి ఉద్యోగం హామీ ఏమైంది కేసిఆర్ ? 


ఉద్యోగాల లేవు , డబుల్ బెడ్ రూం ఎంత మందికి ఇచ్చారు. 


నేను ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు.


పోలీసులు కావాలనే కొన్ని సెలెక్ట్ వీడియోలు బయటపెట్టారు. 


నా శరీరం తాకే వీడియోలు, పోలిసులు నాపై కన్నెర్ర చేసిన వీడియోలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. 


పోలీసులు కే.సి ఆర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారు.


రాజశేఖర్ రెడ్డి భార్య అని పోలీసులకు  కనీస జ్ఞానం లేదు 


విజయమ్మ మహిళ పోలీస్ పై  ఒక చెంపదెబ్బ వేశారు 


దాని విజయమ్మ బాంబులు వేసినట్లు చిత్రీకరించారు.

శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్.. అప్రమత్తమైన టిటిడి

తిరుమల : తిరుమలలో హెలికాఫ్టర్ ల కలకలం..
శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్..
నో ఫ్లైయింగ్ జోన్ గా తిరుమల శ్రీవారి ఆలయం..
అప్రమత్తమైన టిటిడి..
హెలికాప్టర్లు శ్రీవారి ఆలయంపై రావడంపై విచారిస్తున్న టిటిడి..


తిరుమల పై చక్కర్లు కోట్టిన హెలికాప్టర్లు ఏయిర్ పోర్స్ విభాగానికి చెందినవిగా గుర్తింపు


కడప నుంచి చెన్నైకి వెళ్ళే సమయంలో తిరుమల మీదుగా ప్రయాణించినట్లు సమాచారం

చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిల విడుదల

వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. ఓ కానిస్టేబుల్, మరో ఎస్‌ఐపై దాడి చేసిన షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం అమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..  కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో షర్మిల ఉన్నారు. ఒక రోజు  జైల్లో గడపగానే బెయిల్ రావడంతో వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు, అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కు హాజరయ్యేందుకు పులివెందులకు వెళ్లారు. సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

YS Sharmila Bail: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి కేసులో నిన్న షర్మిల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్ననే కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

BRS 23rd Anniversary: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి బైక్ ర్యాలీ

బీఆర్ఎస్ 23వ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి జెండా ఎగురవేసి మేడ్చల్ జిల్లాలోని ఈ యాంజల్ లో ఏర్పాటుచేసిన క్లీనర్ సమావేశానికి ద్విచక్ర వాహనాలపై నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. నాడు టీఆర్ఎస్ గా పుట్టి నేడు బీఅర్ఎస్ గా పార్టీ అవతరించిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేద ప్రజల కడుపు కొడుతూ అంబానీ కడుపు నింపుతున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

Avinash Reddy News: అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం 2.30కు విచారణ

అవినాష్ రెడ్డి పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. వైఎస్ సునీత పిటిషన్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తీర్పు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో లేనందున ఆర్డర్ కాపీ చూశాకే తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందలేదని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.

YS Sharmila News: చంచల్ గూడ జైలుకు వైఎస్ విజయలక్ష్మి

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. నిన్న రాత్రి కోర్టు షర్మిలకు రిమాండ్ విధించడంతో ఆమెను పోలీసులు చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే.

Tirumala News: 10 గంటలకు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని తెలిపింది.

Background

ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి సెంట్రల్ మధ్యప్రదేశ్ లోని ఆవర్తనం నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక  మీదగా ఇంటీరియర్ తమిళనాడు & పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.  రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. 


ఈ రోజు నుండి 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం)తో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 73 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా
‘‘అధిక పీడన ప్రాంతం మధ్య బంగాళాఖాతంలో విశాఖకి తూర్పున కేంద్రీకృతం అయ్యింది. దీని వలన తేమ గాలులు నేరుగా  ఆంధ్రాలోని కొస్తా భాగంలోనికి దూసుకెళ్తున్నాయి. నేడు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలకు అనుకూలంగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ పిడుగులు, వర్షాలు నేడు మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కొనసాగనున్నాయి. ఎప్పుడైతే వేడి తోడౌతుందో అప్పుడు మాత్రం ఈ వర్షాలుంటాయి. కానీ రాత్రికి భూమి చల్లబడుతుంది కాబట్టి వర్షాల జోరు తగ్గుముఖం పట్టనుంది. అలాగే మరో వైపున తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లోని పలు భాగాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. అర్ధరాత్రి సమయానికి బెంగళూరు - అనంతపురం బెల్ట్ లో గాలుల సంగమం ఏర్పడనుంది. దాని వలన పిడుగులు, వర్షాలు నేడు సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో అది కూడ కర్ణాటక సరిహద్దు భాగాల్లో ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తర భారతంలో వాతావరణం ఇలా..
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో వర్షం కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, గురువారం (ఏప్రిల్ 27) నుండి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరో రౌండ్ వర్షం కనిపించవచ్చు, దీని కారణంగా ఉష్ణోగ్రత తగ్గవచ్చు. రాబోయే మూడు రోజుల్లో తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత మూడు నుండి ఐదు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో, నార్త్ వెస్ట్ మరియు వెస్ట్ ఇండియాలో రాబోయే ఒకటి నుండి రెండు రోజుల వరకు గణనీయమైన మార్పు కనిపించదు. బిహార్, యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో ఈ సమయంలో వేసవి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.