Breaking News Live Telugu Updates: పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతూ రోడ్డు ప్రమాదానికి గురైన అభిమానులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Jan 2023 09:19 PM
పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతూ రోడ్డు ప్రమాదానికి గురైన అభిమానులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది.  ధర్మపురి నుంచి హైదరాబాద్ కు పవన్ కల్యాణ్ తిరిగి వెళ్తున్నప్పుడు...  ఆయన అభిమానులు కొందరు పవన్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు.  వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద పవన్ అభిమానులు వెళ్తున్న బైక్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  


 

పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతూ రోడ్డు ప్రమాదానికి గురైన అభిమానులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది.  ధర్మపురి నుంచి హైదరాబాద్ కు పవన్ కల్యాణ్ తిరిగి వెళ్తున్నప్పుడు...  ఆయన అభిమానులు కొందరు పవన్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు.  వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద పవన్ అభిమానులు వెళ్తున్న బైక్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  


 

లక్నో లో కప్పకూలిన రెండంతస్తుల భవనం, సిలిండర్ పేలుడుతో ప్రమాదం 

ఉత్తర్ ప్రదేశ్ లక్నో లో రెండంతస్తుల భవనం కప్పుకూలింది. భవనంలో ఐదు కుటుంబాలు ఉంటున్నట్లు సమాచారం. సిలిండర్ పేలుడుతో భవనం కూలినట్లు తెలుస్తోంది. ముగ్గురుని సహాయక బృందాలు రక్షించాయి. 

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో సర్వీసులు

హైద‌రాబాద్ మెట్రోకు మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. నగరంలోని అమీర్‌పేట – రాయ‌దుర్గం మార్గంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఒకే మార్గంలో రాక‌పోక‌ల వ‌ల్ల మెట్రో రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. దాంతో రాయదుర్గం, అమీర్ పేట మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. మెట్రో రైళ్లు సాంకేతిక సమస్యతో కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కూడా నగరంలో మెట్రో సర్వీసులకు సాంకేతిక సమస్య తలెత్తింది.

Pawan Kalyan in Kondagattu: బీజేపీతో పొత్తు కొనసాగుతుంది - పవన్ కల్యాణ్

ఎన్నికల ప్రచార రథం వారాహికి జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజ చేయించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందులో సందేహం లేదని అన్నారు. 2014లో ఉన్న కాంబినేషన్ రిపీట్ అవుతుందా అని విలేకరులు ప్రశ్నించగా, అందుకు కాలమే సమాధానం చెప్పాలని బదులిచ్చారు. 

Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

నూతనంగా నిర్మించిన డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం  ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ  నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 

Nara Lokesh Tour Schedule: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టూర్ షెడ్యూల్

జనవరి 25 బుధవారం మ‌ధ్యాహ్నం 1.45కి హైదరాబాద్‍లోని ఎన్టీఆర్ ఘాట్‍కి చేరుకుని నంద‌మూరి తార‌క‌ రామారావుకి నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం కడపకు చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంట‌లకు క‌డ‌ప అమీన్ పీర్ ద‌ర్గా సంద‌ర్శిస్తారు. క‌డ‌ప‌లోని రోమ‌న్ కేథ‌లిక్ చ‌ర్చిలో సాయంత్రం 6.30కి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లలో పాల్గొంటారు. రోడ్డుమార్గంలో తిరుమ‌ల చేరుకుని రాత్రి అక్క‌డే  బ‌స చేస్తారు. 26-1-23 గురువారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుంటారు. తిరుమల నుండి బయలుదేరి మ‌ధ్యాహ్నం 2.30 కి కుప్పం చేరుకుంటారు.

దేశం కోసం మోదీ, కుటుంబం కోసం కేసీఆర్ - కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్  యోజన పర్యటనలో భాగంగా పార్లమెంటరీ  వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వికారాబాద్ కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో బిజెపి శ్రేణులతో సమావేశమయ్యారు. జిల్లాలోని పరిగి, తాండూర్ వికారాబాద్ నియోజకవర్గాలలో బిజెపి జెండా ఎగరవేయాలని.. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఆదర్శమని కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేసి ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకునేలా పనిచేశారని అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బిజెపి నాయకురాలు జీవిత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యం

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు ఎస్సీ ఎస్టీ గిరిజన బాలికల హాస్టల్ లో పదో తరగతి చదువుకుంటున్న ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. సోమవారం సాయంత్రం 7 గంటలనుంచి వారు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. కనపడకుండా పోయిన అమ్మాయిలు నాగమణి, మల్లికాజ్యోతి, అంకితగా గుర్తించారు. వారు అదృశ్యమైనట్టు హాస్టల్ సిబ్బంది రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే హాస్టల్ లో ఇలాంటి ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది.

Mekathoti Sucharita: మేకతోటి సుచరిత ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య

గుంటూరులోని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సుచరిత డ్రైవర్ చెన్నకేశవ రెడ్డి గన్ తో కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలియగానే ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు మాత్రం పొగమంచు అంతగా ఉండదని వివరించారు. అంతా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. రాయలసీమలోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.


ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. త్వరలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.4 డిగ్రీలు, 16.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.