Breaking News Live Telugu Updates:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్- వైసీపీ ఖాతాలో ఆరు, టీడీపీకి ఒకటి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 23 Mar 2023 08:00 PM
Background
తెలంగాణలో మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. దీని...More
తెలంగాణలో మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. దీని ఫలితంగానే రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.పగటి, రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది.తెలంగాణలో వాతావరణ స్థితితెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే, 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం నేడు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.హైదరాబాద్ లో ఇలా‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.ఏపీలో వర్షాలు ఇలాఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఢిల్లీలో వాతావరణం ఇలా..ఐదు నెలల్లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి మంగళవారం నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 75కి మెరుగుపడిన తర్వాత పరిస్థితి 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అంతకుముందు ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 11న ఏక్యూఐ 66 కంటే తక్కువగా నమోదైంది. వర్షం, బలమైన గాలులు ఢిల్లీ గాలిని క్లియర్ చేశాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్- ఆరు వైసీపీ, ఒకటి టీడీపీ
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకోగా, ఒకటి టీడీపీ ఖాతాలో వేసుకుంది. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు.
1.మర్రి రాజశేఖర్ (వైఎస్ఆర్ సీపీ)
2.పోతుల సునీత (వైఎస్ఆర్ సీపీ)
3. జయమంగళ వెంకట రమణ (వైఎస్ఆర్ సీపీ)
4.ఏసు రత్నం (వైఎస్ఆర్ సీపీ)
5.సూర్యనారాయణ రాజు (వైఎస్ఆర్ సీపీ)
6.ఇజ్రాయిల్ (వైఎస్ఆర్ సీపీ)
7. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ గెలపు