Breaking News Live Telugu Updates: పెనాల్టీ షూటౌట్ లో ఓటమి, హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Jan 2023 09:21 PM
IND vs NZ, Hockey WC 2023 HIGHLIGHTS: పెనాల్టీ షూటౌట్ లో ఓటమి, హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

IND vs NZ, Hockey WC 2023 HIGHLIGHTS: హాకీ వరల్డ్ కప్ 2023 నుంచి ఆతిథ్య భారత్ నిష్క్రమించింది. న్యూజిలాండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్ లో ఓటమితో భారత్ ఇంటి దారి పట్టింది. పెనాల్టీ షూటౌట్ లో 4-5 తేడాతో భారత్ ఓటమి చెందింది.


India vs New Zealand: The hosts had taken the lead but were stunned by a lower ranked New Zealand. They lost 4-5 in the penalty shootout.


 
Minister Vemula Prashanth Reddy: కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే మాటలు బంద్ చేయాలి - మంత్రి వేముల

సీఎం కేసిఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి వేముల. ఆదివారం ఒక్కరోజే బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలో సుమారు 6 కోట్ల అభివృధ్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. అభివృద్ది చేస్తున్నది ఎవరు మాటలు చెప్తున్నది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. అరవింద్ నిన్ను ఎంపిగా ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా మంచి చేయి అంటే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడగొట్టే మాటలు బంద్  చేయాలని హితవు పలికారు.

Hyderabad: హైదరాబాద్ లో నడి రోడ్డుపై వ్యక్తి హత్య

హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.

Siddipet: సిద్దిపేట్‌లో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో నివాళులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో మహబూబునగర్ జిల్లా ఇల్లేందులో కారును లారీ ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందిన 5 గురు ఫోటో వీడియో గ్రాఫర్ల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారికి నివాళులర్పించారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తున్న సమయంలో తమ సహోదరులు దుర్మరణం పాలు కావడం దురదృష్టకరమని యూనియన్ సభ్యులు అన్నారు. ఫోటో వీడియో షూటింగ్ ఉన్నప్పుడు ఆదరాబాదరగా తొందరగా వెళ్లాలనే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, కార్యక్రమాలకు ఒక గంట ముందుగా వెళ్లే ప్రయత్నం చేయాలని ఫోటో వీడియో గ్రాఫర్స్ కు వారు సూచించారు. బైక్ పై వెళ్తే హెల్మెట్, కారులో వెళ్తే సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకుని వెళ్లాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఫోటో, వీడియో గ్రాఫర్స్ అందరూ అండగా నిలవాలని, ప్రభుత్వం కూడా వారి కుటుంబాలకు ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Hakimpet Explosion: హకీంపేట్ సాలార్ జంగ్  బ్రిడ్జి దగ్గర  పేలిన  గ్యాస్ సిలిండర్లు

  • హకీంపేట్ సాలార్ జంగ్  బ్రిడ్జి దగ్గర  పేలిన  గ్యాస్ సిలిండర్లు

  • గ్యాస్ సిలిండర్ పేలి చెలరేగిన మంటలు

  • వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా పేలిన 5 సిలిండర్లు

  • భారీగా ఎగిసిపడుతున్న మంటలు... మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

Nagababu in Anantapur: అనంతపురం నగరంలో నాగబాబు పర్యటన

అనంతపురం నగరంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు సినీ యాక్టర్ నాగబాబు పర్యటించారు. నగరంలోని చెరువు కట్టపై ఉన్న రోడ్డును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రోడ్లు ఎలా ఉన్నాయో.. ఏపీ రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందులు పెట్టినంతమాత్రాన తమ కార్యక్రమాలను ఆగవని నిప్పులు చెరిగారు. జనసైనికులు రోడ్డు వేస్తారని తెలిసి వైసిపి ప్రభుత్వం వెంటనే పనులను మొదలుపెట్టిందన్నారు. డెమోక్రసీలో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు అని అన్నారు. వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. టిడిపి తో పొత్తు పెట్టుకుని అనంతపురం అర్బన్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానని టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారని అని అడిగిన ప్రశ్నకు పోత్తుల గురించి మాట్లాడే సమయం ఇప్పుడు కాదని చెప్పారు. సభలు సమావేశాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు మట్టికాయలు వేసిందని

ఇంజినీరింగ్ కాలేజీలో దొంగతనం, పారిపోతూ బావిలో పడ్డ దొంగ 

వరంగల్ లో ఓ ఇంజినీరింగ్ హాస్టల్ లో ఫోన్లు, ల్యాప్ టాప్స్ చోరీ చేశాడో దొంగ. చోరీ తర్వాత పారిపోతూ బావిలో పడ్డాడు. దొంగను బావిలో నుంచి బయటకు తీసి అరెస్ట్ చేశారు పోలీసులు. 

Tirumala : శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియా వివాదం, కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు 

 Tirumala : శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై కిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ పై IPC సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో గ్రుహ శ్రీనివాసా, ఐకాన్ ఫ్యాక్ట్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు చూపించినట్లు తెలుస్తోంది. టెంపుల్ సెక్యూరిటీ ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్వహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


 

Background

Gold-Silver Price 22 January 2023: పసిడి ధర నామమాత్రంగా తగ్గింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 50 చొప్పున దిగి వచ్చాయి. బిస్కట్‌ బంగారం ధర ₹57 వేల పైనే ఉంది. కిలో వెండి ధర ₹ 200 పెరిగింది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:


తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,060 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,250 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,060 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,300 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది.  


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,040 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹  52,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,060 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,210 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,300 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,300 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,110 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 52,250 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,060 గా ఉంది.


ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 250 పెరిగి ₹ 27,130 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.


ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.


 


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.