Breaking News Live Telugu Updates : శ్రీవారి ఆలయంపై డ్రోన్, కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Jan 2023 10:03 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం


పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు


ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు వ్యాపించినట్లుగా సమాచారం


ఒక కారునుండి మరో నాలుగు కార్లకు మంటలు చెలరేగాయి


సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,అబిడ్స్ పోలీసులు


మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది


నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం

శ్రీవారి ఆలయంపై డ్రోన్, కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు

తిరుపతి : శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై కిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసారు.. కిరణ్ పై IPC సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.. అయితే ఈ వీడియో గ్రుహ శ్రీనివాసా, ఐకాన్ ఫ్యాక్ట్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు చూపించినట్లు తెలుస్తొంది.. టెంపుల్ సెక్యూరిటీ ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్వహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు..

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: మంత్రి తలసాని

సికింద్రాబాద్ మినిష్టర్ రోడ్డులోని అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్  వేర్  భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరొక్కసారి సందర్శించారు. అధికారులతో కలసి క్రేన్ ద్వారా భవనంలోని అన్ని అంతస్తులను పరిశీలించారు. భవనం వెనుకాల ఉన్న మరొక్క భవనంపైకి ఎక్కి పరిశీలించారు.. బస్తీవాసిలు మూడు రోజుల నుండి తాము పడుతున్న అవస్థల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ఊహించని దుర్ఘటన. ఈ ఘటన వలన చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి స్థానికులను సురక్షిత స్థలానికి తరలించారని పేర్కొన్నారు. వారికి మూడు పూటలా భోజనాలు కూడా అందించడం వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుందని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ అరెస్ట్

వరంగల్ : వరంగల్ ట్రై సిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి హంగామా చేస్తున్నారు.. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారల్లో జోక్యం చేసుకుని కబ్జాలు చేస్తున్నారు . ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను  హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేసిన పోలీసులు  సెకండ్ అడిషనల్​జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు.

సికింద్రాబాద్ - 3 రోజుల తరువాత జునైద్ మృతదేహం లభ్యం

మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం జునైద్ మృతదేహం లభ్యం. 


మృతదేహని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు. 


మృతదేహం వెంట జునైద్ కుటుంబ సభ్యులు.

ఇఫ్లూ వర్సిటీలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య  

హైదరాబాద్ ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన విద్యార్థిని ఇఫ్లూలో MA ఇంగ్లీష్ కోర్స్ చేస్తుంది. ఫ్యామిలీ సమస్యలతో సూసైడ్ చేసుకుందని  ఓయూ  పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

Warangal Accident : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు ఫొటోగ్రాఫర్లు మృతి

Warangal Accident : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సంపేట పట్టణానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లు మృతి చెందారు. కొంపెల్లి శివకోటి, కళ్యాణ్, రాము అనే ఫోటోగ్రాఫర్లు గతరాత్రి ఒంటిగంట సమయంలో ఇల్లందు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. 

Background

Warangal Accident : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సంపేట పట్టణానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లు మృతి చెందారు. కొంపెల్లి శివకోటి, కళ్యాణ్, రాము అనే ఫోటోగ్రాఫర్లు గతరాత్రి ఒంటిగంట సమయంలో ఇల్లందు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. 


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా


పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న అరేబియా సముద్రంలో ఏర్పడిన ట్రఫ్ కారణంగా తెలుగురాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా తగ్గిందని.. ఇది మరింత తగ్గనుంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రం చలి ప్రభావం కాస్త ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే తగ్గనుంది. శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తేమ గాలులు వీయనున్నాయి. ముఖ్యంగా ఏపీకి దక్షిణ భాగంలో వీటి ప్రభావం ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో వెచ్చని వాతావరణం ఉంటుంది. విశాఖ విజయనగరం, పార్వతిపురం, మన్యం, అరకలో వెచ్చని వాతావరణం కనిపిస్తుంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో కాస్త చలిగా ఉంటుంది. 


ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ కూడా వెచ్చటి గాలులు వీస్తుంటాయి. దీని వల్ల చలి తీవ్రత తగ్గిపోనుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌,హైదరాబాద్, మెదక్‌లో చల్లని వాతావరణం ఎక్కువగా ఉంటుంది. గతంలో పోలిస్తే మాత్రం తగ్గతుంది. మిగిలిన ప్రాంతాల్లో వెచ్చని వాతావరణం ఉంటుంది. ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలానికి వెళ్లేటప్పుడు మారిన వాతారణం కారణంగా వర్షాలు పడటం సహజం. ఈసారి కూడా జనవరి ఆఖరిలో వర్షాలు పడే  సూచనలు కనిపిస్తున్నాయి. గత పది సంవత్సరాల్లో ప్రతిసారి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏదో ఒక నెలలో వర్షాలు చూస్తున్నాం. ఈసారి జనవరి చివరి వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ పగటి వేళలో వేడి పెరుతుంది. రాత్రి చల్లగా ఉంటుంది. 


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టే హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడా భూమిలోనే అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్‌లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారు. పశ్చిమ గాలుల ప్రభావం అని కూడా అనొచ్చు. ఇది సాధారణంగా తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం ఎఫెక్టు ఉంటుంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. 24న పాకిస్థాన్, అరేబియ సముద్ర మీదుగా ఏర్పడిన ట్రఫ్ కారణంగా కూడా వర్షాలు పడొచ్చు. ఇది ఎంత వరకు ప్రభావం చూపుతుంది. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని మాత్రం సోమవారానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికేతే మాత్రం శ్రీలంక మీదుగా ఏర్పడిన ఆవర్తనం కారణంగా జనవరి 27, 28 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తుంపరులతో కూడిన జల్లులు పడొచ్చు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.