Breaking News Live Telugu Updates:పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Apr 2023 07:42 PM

Background

నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి దక్షిణ ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు...More

పలాస టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దుండగులు హత్యాయత్నం చేశారు. లక్ష్మణరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికులు చేరు కోవడంతో దుండగులు పరారయ్యారు. సోంపేట వైపు బస్సులో దుండగులు పరారయ్యారు. గాయపడిన లక్ష్మణరావును గౌతు శిరీష ఆసుపత్రికి తరలించారు.