Breaking News Live Telugu Updates: లోకేశ్ కడప పర్యటనకు అనుమతి నిరాకరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
రేపు కడపలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేనందున పర్యటనలో పాల్గొనవద్దంటూ టీడీపీ నాయకులకు పోలీసుల నోలీసులు ఇచ్చారు. మూడు రోజుల క్రితం అరెస్టైన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు లోకేశ్ కడపకు రానున్నారు. కడప కేంద్ర కారాగారంలో ఉన్న ప్రవీణ్ ను పరామర్శించిన అనంతరం, ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు. టీడీపీ నాయకులు లోకేశ్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో పాల్గొనవద్దంటూ టీడీపీ నాయకులకు పోలీసులు సూచిస్తున్నారు. లోకేశ్ పర్యటనకు అనుమతిలేదంటున్నారు. అనుమతిలేనందున సదరు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరపకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్ లో వైజాగ్ నుండి విజయవాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గవర్నర్ ను కలవనున్న జనసేనాని
అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుంటారు.
పోలీసుల అధీనంలోకి విశాఖ విమానాశ్రయం
పవన్ రాకపై పూర్తి సమాచారం లేదన్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు
ఫ్లైట్ వివరాలు తెలుసుకుని ప్రయాణికులను లోపలికి పంపిస్తున్న అధికారులు
ఒక వేళ పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు కు వస్తే ఆయన వెహికల్ తో పాటు మరొక వాహనానికే ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతి ఇచ్చిన ఎయిర్ పోర్టు అధికారులు
* రాజమండ్రిలో ఉద్రిక్తత
* రాజమండ్రిలో టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్‍ను అడ్డుకున్న పోలీసులు
* పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసుల ఆంక్షలు
* బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు
* కోనేరు మురళి నివాసం వద్ద అడ్డుకున్న పోలీసులు
* కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
* అమరావతి రైతులకు సంఘీభావంగా మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్
గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. పోలింగ్ అధికారుల తీరుపై పొన్నాల లక్ష్మయ్య సీరియస్ అయ్యారు. ఎన్నికల అధికారుల తీరు సరిగా లేదన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్లలో వ్యక్తి దారుణ హత్య
కంచికచర్ల పట్టణంలో గత రాత్రి దారుణ హత్య జరిగింది...
తన ఇంటి వద్ద చల్లకంటి నాగరాజు అనే వ్యక్తి దారుణ హత్య.
సంఘుటన స్ధలనికి చేరుకున్న పోలీసులు.
హత్యఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అమెరికాలో గుంటూరు యువకుడు గంగూరి శ్రీనాధ్ మృతి.
అట్లాంటా లో ట్రెక్కింగ్ కు వెెళ్లి కాలు జారి పడి మృతి చెందిన శ్రీనాధ్,
శ్రీనాధ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస్ అల్లుడు.
అమరావతి రైతుల మహాపాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఇవాళ అమరావతి రైతులు 15 కిలోమీటర్లు నడవనున్నారు. రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జిని మూసివేసినందున కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుంచి రైతులు రాజమండ్రి చేరనున్నారు. హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కావడంతో రాజధాని రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. గామన్ బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు పోలీసుల అభ్యంతరం తెలిపారు. రూట్ మార్చుకోవాలని జేఏసీ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రెండురోజుల కిందట ప్రయత్నం చేశారు. నోటీసులు తీసుకునేందుకు జేఏసీ నేతలు నిరాకరించారు. దీంతో కొవ్వూరులో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
- ఈ ఉదయం 10 గంటలకు దోమలగూడలోని బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- నర్సయ్య గౌడ్ ను బీజేపీలోకి ఆహ్వానించడానికి రాక
- పోలీసుల పహారాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన నోవోటెల్ హోటల్
- పవన్ కళ్యాణ్ తదుపరి చర్యలపై పోలీసుల్లో ఉత్కంఠ
- సుమారు 300 మంది పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ ఇస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు
Background
గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం బలపడి ఇదివరకే తేలికపాటి అల్పపీడనంగా మారింది. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
అక్టోబర్ 18న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతుందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో నేడు సాధారణ వర్షపాతం నమోదుకానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నిన్న కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. సూచనతో ఉత్తరాంధ్ర జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అత్యధికంగా కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో అక్టోబర్ 22న తుఫాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. అర్ధరాత్రి అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో మాత్రం వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -