AP Budget Live Updates: 2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Mar 2023 11:44 AM
గడప గడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు కేటాయింపు

ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు
వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకానికి -రూ.200 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా పథకానికి -రూ.6700 కోట్లు
వైఎస్సార్‌ చేయూత పథకానికి -రూ.5000 కోట్లు
మనబడి నాడు-నేడు పథకానికి -రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక పథకానికి - రూ.560 కోట్లు
పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
పేదలందరికీ ఇళ్లు పథకానికి -రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఎనర్జీ- రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి- రూ.532 కోట్లు

వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.

వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.
వ్యవసాయ శాఖ- రూ. 11589.48 కోట్లు 
సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు
వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు 
ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు
విద్యుత్ శాఖ- రూ.  6546.21 కోట్లు 

జగనన్న చేదోడు పథకానికి రూ.350 కోట్లు, రైతు కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు

జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్సార్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
లా నేస్తం-రూ.17 కోట్లు

వ్యవసాయ శాఖకు రూ. 11589.48 కోట్లు కేటాయించిన బుగ్గన

కేటాయింపులు ఇలా ఉన్నాయి. 
వ్యవసాయ శాఖ- రూ. 11589.48 కోట్లు 
సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు
వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు 
ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు
విద్యుత్ శాఖ- రూ.  6546.21 కోట్లు 


ఎస్సీ కార్పొరేషన్- రూ. 8384.93 కోట్లు 
ఎస్టీ కార్పొరేషన్- రూ. 2428 కోట్లు 
బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు 
ఈబీసీ కార్పొరేషన్- రూ. 6165 కోట్లు 
కాపు కార్పొరేషన్- రూ. 4887 కోట్లు 
క్రిస్టియన్ కార్పొరేషన్- రూ. 115.03 కోట్లు 

2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌

మొత్తం బడ్జెట్‌- 2 లక్షల  79  వేల కోట్లు 
రెవెన్యూ వ్యయం - 2,28,540 కోట్లు
మూలధన వ్యయం - 31,061 కోట్లు
రెవెన్యూ లోటు - 22,316 కోట్లు
ద్రవ్య లోటు - 54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు - 3.77 శాతం
ద్రవ్య లోటు - 1.54 శాతం

బడ్జెట్‌లోని అంశాలు ప్రజలకు చేరకూడదనే ఆందోళన చేస్తున్నారు: సీఎం

బడ్జెట్‌ వల్ల జరిగే మంచిని ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షం ఆందోళన చేయడం ఏంటీ: సీఎం
వాళ్లను పంపించేసి బడ్జెట్‌ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలి: సీఎం

నాలుగేళ్లలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని పని చేశాం: బుగ్గన

నాలుగేళ్లలో ఆర్థిక శాఖ ఫ్యామిలీలా పని చేశాం: బుగ్గన 
నాలుగేళ్లు సహకరించిన ఆర్థిక శాఖాధికారులకు ధన్యవాదాలు: బుగ్గన 
పేదల పట్ల, ప్రజల పట్ల సీఎంకు ఉన్న బాధ్యత, ప్రేమతో నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాను: బుగ్గన 

AP Budget: బడ్జెట్ ప్రతులను సీఎం జగన్ కు అందజేత

అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ కు బడ్జెట్ కాపీలను అందజేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఇతర మంత్రులు

AP Cabinet Meet: రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి


2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి


2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆమోదించిన  మంత్రిమండలి

AP Budget: నేడే అసెంబ్లీలో ఏపీ బడ్జెట్, కాసేపట్లో ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన

బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. వాటికి పూజలు చేయించారు. అనంతరం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

Background

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు (మార్చి 16) 10 గంటలకు  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టానున్నారు. రూ.2.70 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని అంచనా. గత ఏడాది కంటే కూడా ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలకు అధిక మొత్తంలో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. నాడు-నేడు కింద ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


నిన్న ఆర్థిక సర్వే
శాసన సభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బుధవారం (మార్చి 15) విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని అన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన తెలిపారు.


మొత్తం భారత దేశం సరాసరి కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని వివరించారు. సేవా రంగంలో  18.91 శాతం, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం చొప్పున వృద్ధి నమోదైందని వివరించారు. 36 శాతం కంట్రిబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందని, ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని అన్నారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైందని అన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామని, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.


8 గంటలకు కేబినెట్ భేటీ


ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉద­యం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవనున్నారు. వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్త­యిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదివి వినిపించనున్నారు. 


ఇప్పటికే బడ్జెట్ గురించి అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. అన్ని రంగాల అభివృద్ధిని సమ్మి­ళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ­కు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యే­కం­గా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సబ్సిడీకి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.