Breaking News Live Telugu Updates: కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Dec 2022 07:51 PM
కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 

కాసేపట్లో కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెండ్ల మనోహర్ 


 కన్నాతో నాదెండ్ల భేటీపై రాజకీయంగా ఆసక్తి .


 సోము వీర్రాజు నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కన్నా 


 జనసేన రోడ్ మ్యాప్ విషయంలో సోము వీర్రాజు తీరును ఖండించిన కన్నా 


ఇద్దరు నేతల భేటీపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ .


 కన్నాను నాదెండ్ల మనోహర్ జనసేనలోకి ఆహ్వానించబోతున్నారా? 


రెండు పార్టీల మధ్య గ్యాప్ పై చర్చించుకుంటారా?

Visakhapatnam: కళాకారుల అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్ ఆత్మహత్య యత్నం

విశాఖ... కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్, కళాకారుల అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్ ఆత్మహత్య యత్నం!!


కారు లో పురుగులు మందు త్రాగిన మారుతి ప్రసాద్!


గాయత్రీ ఆస్పత్రికి తరలింపు.


ఐసీయూ లో చికిత్స అందిస్తున్న వైద్యులు.


ఆస్పత్రికి చేరుకున్న భీమిలి సమన్వయ కర్త ముత్తం శెట్టి మహేష్,కార్యకర్తలు


విచారణ చేపట్టిన పిఎంపాలెం పోలీసులు

Telangana Congress: గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూం కార్యాలయంపై పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల్లో ధర్నాకు దిగారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలు దేరగా.. అదంతా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ భవన్ గేటు దగ్గర బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

BRS Party Office Inagurating: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, రాజశ్యామల యాగంలో కేసీఆర్ దంపతులు

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. వేదపండితుల మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం జరుగుతోంది. వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు. సీఎం కెసీఆర్ తో పాటు ఎస్పీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, గుర్నాం సింగ్ తదితర జాతీయ రైతు నంఘం నేతలు, మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Congress: పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకుల నిరసన

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయాన్ని కుట్ర పూరితంగా సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను నిరసిస్తూ పోలీసుల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అనిల్ యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంపైన పోలీసులు దాడి, సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని నేతలు నిలదీశారు.

Chittoor: పొద్దు పొద్దున్నే రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల గుంపు

పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. విపరీతమైన మంచు కురుస్తుండగా కొంతమంది గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్ లో గజరాజులను చిత్రీకరించారు. గ్రామాల వైపు వస్తాయేమోనని అరుపులతో అటవీ మార్గంలోకి తరమడంతో ఓ మదఫుటేనుగు ఘీంకరిస్తూ గ్రామస్తులను వెంబడించడంతో అంతా పరుగు లంకించుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. 30 నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ స్ధానికులను భయాందోళనకు గురి చేశాయి. అటుపక్క గుడియాత్తం నుండి వచ్చే వాహనదారులు ఇటుపక్క పలమనేరు నుండి వెళ్లే వాహనదారులు ఏనుగులు వెళ్లే వరకు వేచి చూడాల్సి వచ్చింది. తమ గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల వైపు ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

Background

మాండస్ తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గిపోగా, త్వరలో మరో అల్ప పీడనం ఏర్పడినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. మాండస్‌ తుపాను పరిస్థితుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం (డిసెంబరు 13) అల్పపీడనం ఏర్పడింది. ఇవాల్టికి (డిసెంబరు 14) ఇది తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఇది మరింత బలపడి ఈ నెల 15 నాటికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


ఇటు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు, మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 


శ్రీలంక సమీపంలోకి వచ్చిన అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ, శ్రీలంక కింది భాగం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తమిళనాడు వైపు ట్రాక్ తీసుకుంటే తప్పకుండా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మాండస్ తుపాను సమయంలో పడిన భారీ వర్షాల తరహాలో వర్షాలు ఉంటాయి. రెండో ట్రాక్ తీసుకుంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది. మూడో ట్రాక్ తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడి ఈనెల 19వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.


ఇక తూర్పుగాలుల ప్రభావంతో మంగళవారం రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 23 తేదీల మధ్య మరో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధికారుల‌కు నిర్దేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మనుబోలు మండలం కాగితాలపూరు, గురువిందపూడి గ్రామాలను సందర్శించి గ్రామ సచివాలయం కార్యాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు/ఆగ్నేయ దిశల నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.