Breaking News Live Telugu Updates: చీటింగ్ కేసులో అంబర్ పేట్ సీఐ సుధాకర్ అరెస్ట్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Jan 2023 07:47 PM
చీటింగ్ కేసులో అంబర్ పేట్ సీఐ సుధాకర్ అరెస్ట్ 

చీటింగ్ కేసులో అంబర్‌పేట సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హయత్ నగర్ లోని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.  

జనాలతో కిక్కిరిసిన  సికింద్రాబాద్  రైల్వే స్టేషన్  

సంక్రాంతి  పండుగను పురస్కరించుకొని సెలవులు రావడంతో  హైదరాబాద్ నగర వాసులు  తమ సొంత ఊర్లకు  బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. నగరంలోని బస్ స్టేషన్లు కూడా ఊర్లకు వెళ్లే వాళ్లతో కోలాహలంగా ఉన్నాయి.

Giridhar Gamang meets KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా  భేటీ అయ్యారు. ఈ భేటీ లో ఆయన కుమారుడు, శిశిర్ గమాంగ్ తదితరులు ఉన్నారు.



Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో వాల్తేరు వీరయ్య సందడి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముకుంద ఏసియన్ థియాటర్ లో వాల్తేరు వీరయ్య మూవీ బినిఫిట్ షో రిలీజ్  ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. థియేటర్ ముందు,పెద్ద పెద్ద కటౌట్లతో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా  జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునీర్ మాట్లాడుతూ.. తమ అభిమాన హీరో చిరంజీవి, రవితేజతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారని ఇద్దరు కలిసి వెండితెరపై అద్భుతం చేశారని అన్నారు.

Vande Bharat Train: వందేభారత్ రైలు పగిలిన అద్దం మార్పు

వందే భారత్‌ రైలుపై దుండగులు దాడి చేసి అద్దాన్ని పగలగొట్టిన ఘటనలో వెంటనే దాన్ని మార్చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ రైలును నడపనున్న సంగతి తెలిసిందే. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నందున వెంటనే పగిలిన అద్దం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి ఆగమేఘాలపై మరొక అద్దం తెప్పించారు. వెంటనే ఆ అద్దాన్ని టెక్నికల్‌ సిబ్బంది అమర్చారు.

Malakpet News: మలక్ పేట ఆస్పత్రిలో విషాదం

  • మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ మృతి

  • మొత్తం ఇద్దరు బాలింతలు చనిపోయినట్లుగా సమాచారం

  • వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ

Hyderabad Chain Snatching: హైదరాబాద్ లో చైన్ స్నాచర్ ల కలకలం

  • హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్ ల కలకలం

  • మొన్న చైన్ స్నాచర్ ఘటన మరువక ముందే మరో ఘటన

  • వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల  చైన్ లాకెళ్లిన దుండగుడు

  • ఎల్బీ నగర్ పీఎస్ కాకతీయ కాలని పరిధిలో చైన్  స్నాచింగ్

  • కాకతీయ కాలనీలో యాభై ఏళ్ల వృద్ధురాలు కాలినడకన వెళ్తుండగా బైక్‌పై వచ్చి ఆమె రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగుడు

  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎల్బీనగర్ పోలీసులు

KCR Condolence: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Kesineni Nani: ఆ బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చి కొడతారు - కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమను ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీ‌చేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు నాని. ఎన్నికలకు‌ చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారని.. సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తానే సామంతరాజుననే ఇగో, పొగరుని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనతో సహా అందరూ త్యాగాలకు సిద్ధం కాకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. తాను రెండుసార్లు ఎంపీగా గెలిచానని అన్నారు.  ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. తనకు ఎంపీగా ప్రజలు అవకాశం ఇచ్చారని.. వారి కోసం పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కలుపుకెళ్లడం అనేది రెండు వైపులా ఉండాలని.. ఐలవ్ యు.. యు డోంట్ లవ్ మి అంటే కుదరదు అన్నారు. తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారని.. ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిలిచినా తాను వెళ్తానని అన్నారు.

Background

ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కరైకాల్, రాయలసీమ, దక్షిణా కోస్తాలోని కొన్ని చోట్ల నేటి నుంచి స్వల్పంగా చలి తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


నేడు పొడిగాల ప్రభావంతో చలి తగ్గనుంది. సముద్రంలోని తేమ గాలులు కోస్తా తీరం వెంబడి రావడం వల్ల కాస్త వెచ్చదనం ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమల్లో చలి తీవ్రత తీవ్రంగానే ఉంటుందని తెలిపారు.


‘‘విశాఖ నగరంలో చలి గత నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గింది. విశాఖ నగరంతో పాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లల్లో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ కి పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఒక్క కైలాసగిరి తప్ప​. చిన్న వాల్టేరు - 22.1 C, గాజువాక - 22 C, అనకాపల్లి - 21.9 C, కైలాసగిరి - 18.4 C ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయి కాబట్టి తీవ్రమైన చలి నగరంలో జనవరి 13 నుంచి ఉండే అవకాశాలు లేవు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ, అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.  ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.1 డిగ్రీలు, 14.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.