Breaking News Live Telugu Updates: పొన్నూరు వైసిపి నేత రావి వెంకటరమణను సస్పెండ్ చేసిన వైసీపీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Oct 2022 09:13 PM
పొన్నూరు వైసిపి నేత రావి వెంకటరమణను సస్పెండ్ చేసిన వైసీపీ

పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు వైసిపి నేత రావి వెంకటరమణను పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. 

Palnadu District: అలుగును నిర్బంధించిన వ్యక్తుల అరెస్టు

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ లో ఓ ఇంట్లో అడవిలో ఉండే అలుగును అక్రమంగా నిర్బంధించారు. దీంతో ఆ వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలుగును స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని అటవీశాఖ పోలీసులు విచారణ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిద్ర లేచాడు: మాజీమంత్రి అవంతి

విశాఖ:  అవంతి శ్రీనివాసరావు మాజీమంత్రి కామెంట్స్.


వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం మూడు రాజధానులు  చేస్తున్నారని విమర్శించడం సరికాదు.


పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిద్ర లేచాడు.


పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా విశాఖలో 15 వ తేదీన  పర్యటన మార్చండి.


పవన్ కళ్యాణ్ విశాఖ వద్దు అమరావతి ముద్దు అనడం సరికాదు.


అమరావతి లో 29 లే కాదు మిగిలిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి.


వైకాపా నాయకులు విశాఖ ఎక్కడైనా అక్రమించారా చూపించండి.


విశాఖ అబివృద్ధి చెందకూడదనే విపక్షాలు కుట్ర చేస్తున్నాయి.

వికేంద్రీకరణ కు మద్దతు గా గోడపత్రికను ఆవిష్కరించిన వికేంద్రీకరణ  జె ఏ సి

విశాఖపట్నం : మంత్రి గుడివాడ అమర్నాథ్  కామెంట్స్


వికేంద్రీకరణ కు మద్దతు గా గోడపత్రికను ఆవిష్కరించిన వికేంద్రీకరణ  జె ఏ సి


వికేంద్రికరణకు మద్దతుగా  ప్రభుత్వం  ముoదుకు వెళుతున్న సమయంలో  కొంతమంది సమస్యలు సృష్టిస్తున్నారు.


 మూడు రాజదానులకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి.


ఉత్తరాంద్ర ప్రాంత అబివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరం.


ఉత్తరాంద్ర అబివృద్ధి చెందకూడదనే హక్కు ఎవరికి లేదు.


ఉత్తరాంద్ర మీదకు దందా యాత్ర చేస్తున్నారు.


15 వ తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి  రాజశేఖర్ రెడ్డి విగ్రహము వరకు పాదయాత్ర ఉంటుంది.

CI Nageshwar Rao: మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేస్ లో ఛార్జ్ షీట్ దాఖలు

  • వనస్థలిపురం మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేస్ లో ఛార్జ్ షీట్ దాఖలు

  • 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన రాచకొండ పోలీసులు 

  • రేప్ అండ్ కిడ్నాప్ కేసులో నాగేశ్వర్ రావ్ అరెస్ట్ 

  • రెండు నెలల పాటు జైల్లో ఉన్న నాగేశ్వర్ రావు, ఇటీవలే బెయిల్ పై విడుదల

  • నాగేశ్వర్ రావును సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్

  • రెండు రోజుల క్రితమే పూర్తిగా సర్వీస్ నుండి తొలగించిన అధికారులు 

  • నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేస్ లో అన్ని సాక్ష్యాలను కోర్ట్ లో సమర్పణ 

  • తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలు పొందపరిచిన పోలీసులు

  • సీసీ ఫుటేజ్ వివరాలు, డీఎన్ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన పోలీసులు 

  • నాగేశ్వర్ రావుకు తగిన శిక్ష పడేలా కోర్ట్ లో అన్ని ఆధారాలు సమర్పించిన పోలీసులు

Nellore News: చిల్లర రాజకీయాలు మానుకోండి, ఉస్కోమంటే ప్రెస్ మీట్లు - మాజీ మంత్రి అనిల్

ఉస్కోమంటే కొంతమంది తనపై ప్రెస్ మీట్లు పెట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్. నెల్లూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొంతమంది బిస్కెట్లకోసం ఎగబడి ఉస్కో మంటే తనపైకి వస్తున్నారని చెప్పారు. ఏడుపుగొట్టు రాజకీయాలు తనకు చేతగావని, జగన్ ఆశీస్సులతో ఎవరినైనా ఢీకొనే సత్తా తనకు ఉందని అన్నారు అనిల్. ఎవరి దగ్గరా తాను డబ్బులు తీసుకోలేదని, డబ్బులు తీసుకున్నట్టు ఆరోపించేవారు ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. 20 కోట్ల రూపాయల ఇల్లు తనకి ఉందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు అనిల్. గతంలో కూడా అనిల్ వెన్నుపోటు రాజకీయాలంటూ సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూడా అనిల్ సొంత పార్టీ నేతలే తనపైకి వైరి వర్గాల్ని ఉస్కో అంటూ ఉసిగొల్పుతున్నారంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు అనిల్.

Palvai Sravanthi: ఈనెల 14న పాల్వాయి స్రవంతి నామినేషన్

ఈ నెల 14వ తేదీన మద్యాహ్నం 1 గంటకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చండూర్ తహశీల్దార్ కార్యాలయంలో పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Guntur Fire in Cars: గుంటూరు జిల్లాలో మూడు కార్లు దగ్ధం

  • గుంటూరు జిల్లాలోని స్థంభాల గరువు నర్సిరెడ్డి పాలెంలో ప్రమాదవ శాత్తు మూడు కార్లు దగ్దం

  • పార్క్ చేసిన కార్లలో ఎగసిపడిన మంటలు

  • విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్లు భావిస్తున్న స్థానికులు‌

  • మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Anantapur Floods: అనంతపురాన్ని ముంచెత్తిన వరద

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం వరద ముంపునకు గురైంది. అనంతపురం పట్టణంతోపాటు ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు నడిమి వంకకు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలైన చంద్రబాబు కొట్టాల, దండోరా కాలనీ, రజక నగర్,  రుద్రంపేట తదితర ప్రాంతాలలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరి తిండిగింజలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి వెంటనే స్పందించి అన్ని శాఖల అధికారులను సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ముంపునకు గురైన ప్రజలకు భోజన వసతి  కల్పించారు. మరోవైపు వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను పట్టణ డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  నడిమి వంకు కొన్ని ప్రాంతాలలో రక్షణ గోడలు లేకపోవడంతోనే తరచూ కాలనీలు ముంపుకు గురవుతున్నాయన్నాయి.  ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకొని నడిమి వంకకు కొన్నిచోట్ల ప్రొటెక్షన్ వాల్ ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. పలువురు కార్పొరేటర్లు ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై మున్సిపల్ సర్వసభ్య సమావేశాలలో లేవనెత్తినప్పటికీ సమస్య అపరిష్కృతంగానే ఉంది.

Background

బలహీనమైన తూర్పు గాలుల వలన నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు సాధారణంగా ఉంటాయి. బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం మరో రెండు రోజుల వరకు ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 15 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.



నేడు సైతం రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 22 కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదవుతోంది. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం నమోదుకానుంది.  విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా. నేడు బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాత్రి సమయానికి అనంతపురం - కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు, సత్యసాయి జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు వర్షాలు విస్తరించనున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.