Breaking News Live Telugu Updates: రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల నిరాహార దీక్ష

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Dec 2022 10:59 AM

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్‌ గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా...More

Bapatla Accident: బాపట్ల జిల్లా అద్దంకిలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం లోని కొప్పెరపాడు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ముందు కూర్చున్న ఒక వ్యక్తి క్యాబిన్లో ఇరుక్కుపోయి గంటసేపు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఇరుక్కుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 20 మందికి పైగా రక్త గాయాలయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం
తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి కావలి పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.