Breaking News: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్ల దగ్ధం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 12 Nov 2021 08:53 PM
విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూరుకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో గ్యాస్ సిలెండర్లు పేలడంతో మంటలు మరింత ఎగసిపడుతున్నాయి. 

కర్నూలులో తెలంగాణ మద్యం పట్టివేత

అక్రమ మద్యం రవాణాపై కర్నూలు సెబ్ టాస్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు సెబ్ టాస్క్ ఫోర్సు బృందం తనిఖీల్లో  తెలంగాణ నుంచి కర్నూలుకు తెలంగాణ మద్యం తరలిస్తుండగా మునగలపాడు జంక్షన్ వద్ద 744 తెలంగాణ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నామని సెబ్ సీఐ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఒక వాహనం సీజ్ చేసి ఓ వ్యక్తి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అక్రమ మద్యం రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

MLC Elections: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ  MLCల జాబితా విడుదల

స్థానిక సంస్థల కోటాలో వైసీపీ  MLCల జాబితా


అనంత్‌ఉదయభాస్కర్- తూర్పుగోదావరి
హనుమంతరావు - మంగళగిరి 
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - గుంటూరు
భరత్‌- కుప్పం
వై. శివరామిరెడ్డి- అనంతపురం 
తూమాటి మాధవరావు- ప్రకాశం 
ఇందుకూరు రఘురాజు-విజయనగరం 
వరుదు కల్యాణి- విశాఖ 
వంశీకృష్ణ యాదవ్‌- విశాఖ 
మొండితోక అరుణ్‌కుమార్- కృష్ణా జిల్లా 
తలశిల రఘురాం- కృష్ణా జిల్లా 

అమిత్ షా తిరుపతి పర్యటన ఖరారు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుపతిలో మూడు రోజుల పర్యటన కోసం ఈ నెల 13న అమిత్ షా తిరుపతికి రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదే రోజు తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొంటారు. ఈ నెల 15న శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకుంటారు. అనంతరం అమిత్‌ షా దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. 

స్వర్ణముఖి వరదలో చిక్కుకున్న దంపతులు.. కాపాడేందుకు పోలీసుల ప్రయత్నాలు 

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం స్వర్ణముఖి నదితీరంలో వరద దాటికి దంపతులు చిక్కుకున్నారు. గురువారం రాత్రి నుంచి ఆకలితో అలమటిస్తున్న సంవత్సరం బిడ్డతో దంపతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తీరందాటి ఇంటి వైపు వచ్చేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. వారిని కాపాడేందుకు తిరుచానూరు పోలీసులు రంగంలోకి దిగారు. చిగురువాడ వద్ద స్వర్ణముఖి నదీ తీరానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఫైర్ ఇంజన్  మధ్యలోనే నిలిచిపోయింది. దంపతులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు మంత్రి ఇంద్రకరణ్ ధర్నా

వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల వైఖరికి నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు  మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని

వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌరస్తా వద్ద టీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. యాసంగి వరిని కొంటారా? కొనరా?! అంటూ ధర్నాలో హోరెత్తిన నినాదాలు. వడ్లు కొనాలంటూ ధర్నాలో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని పెద్ద పులి మృతి..!

నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని పెద్ద పులి మృతి. కర్నూలు జిల్లా చలమ మొదటి టన్నల్ వద్ద 233/9 మైలు రాయివద్ద గుడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో పులి మృతి చెందింది. పులి రైలు ప్రమాదం తో చనిపోయిందా.. లేక మరే ఇతర కారణాలతో చనిపోయిందా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ భేటీ 14న..

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 14న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఈ నెలలోపు పంటల సాగుపై అవగాహన, ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో కూడా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

అలిపిరి నడక‌మార్గం తాత్కాలికంగా మూసివేత

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే అలిపిరి నడక‌మార్గం తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు అధికంగా ప్రవహిస్తూండడంతో భక్తుల భధ్రత దృష్టి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్ల మార్గం గుండా మాత్రమే భక్తులను అనుమతిస్తోంది.

నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు

రైతుల పంట కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని సర్కార్ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు ఆందోళ చేపడుతున్నారు. నిన్న బీజేపీ నేతలు ధర్నా చేయగా.. నేడు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు సైతం నిరసనకు దిగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేపట్టనుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.70 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.1.30 పైసలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,300 ఎగబాకినట్లయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో గ్రాముకు రూ.70 పెరిగి.. రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.70,600గా ఉంది. 

Background

రైతుల పంట కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని సర్కార్ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు ఆందోళ చేపడుతున్నారు. నిన్న బీజేపీ నేతలు ధర్నా చేయగా.. నేడు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు సైతం నిరసనకు దిగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేపట్టనుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు.


హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టీఆర్ఎస్ నేతలు ఉమ్మడి ధర్నాలో పొల్గొంటారు. ఈ నిరసన సక్సెస్ అయ్యేలా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లా ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రైతుల ధర్నాలో పాల్గొంటారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన  కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు మూడు లక్షల మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ దర్నాలో పాల్గొనేలా పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.70 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.1.30 పైసలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,300 ఎగబాకినట్లయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో గ్రాముకు రూ.70 పెరిగి.. రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.70,600గా ఉంది. 


కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చాయి. కానీ, తాజాగా కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కాస్త ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.


హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. దీంతో తాజా ధర రూ.107.88 గా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.31గా నిలకడగా ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.