Breaking News Live: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 24 Jan 2022 07:07 PM
మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..

మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్ ను సైబర్ కేటుగాళ్ళు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. మెయిన్ సర్వర్ హ్యాక్ చెసి 12.4 కోట్ల రూపాయలు కాజేశారు. వెంటనే 12.4 కోట్లు.. 127 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి.. 4 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన సఫారీ వాహనం

అనంతపురం జిల్లా.. సోమలదొడ్డి వద్ద సఫారీ వాహనం హాల్చల్ చేసింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి 4 కిలో మీటర్లు ఈడ్చుకొచ్చింది. సఫారీ వాహనంతో ఢీకొట్టి.. ముగ్గర్ని చంపే ప్రయత్నం జరిగింది. అయితే హత్యకేసులో వాయిదాకు వస్తుండగా.. తండ్రీ కొడుకులపై ఈ హత్యాయత్నం జరిగింది. రేగటికొత్తూరులో ఏడాది క్రితం పొలం వద్ద ఘర్షణలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. హత్యకేసులో వాయిదాకు వస్తున్న వెంకటరమణారెడ్డి, పుల్లారెడ్డి, గురుశేఖర్ రెడ్డి.. ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సఫారీ వాహనం ఢీ కొట్టింది. దీంతో తండ్రీ కొడుకులు కింద పడిపోయారు. అయితే ద్విచక్ర వాహనాన్ని అలానే.. నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత.. సఫారీ వాహనాన్ని హంద్రీనీవా కాలువ లో వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి

తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే అవకాశం ఉంది. కరోనాపై వైద్యారోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో విధ్యాబోధనకు అనుమతించొచ్చని పేర్కొంది. కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో 20 శాతానికి పైనే పాజిటివ్ రేటు ఉందని తెలిపింది. మరో పదిరోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.  రేపు వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి

తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే అవకాశం ఉంది. కరోనాపై వైద్యారోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో విధ్యాబోధనకు అనుమతించొచ్చని పేర్కొంది. కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో 20 శాతానికి పైనే పాజిటివ్ రేటు ఉందని తెలిపింది. మరో పదిరోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.  రేపు వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖలో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై దిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ వద్ద కీలక భేటీ జరుగుతోంది. ఐదుగురు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఏపీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ బృందం చర్చిస్తోంది. కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌ బ్లాక్‌లో ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. 

కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి 

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ  మ‌రొసారి భ‌క్తుల‌ను కోరింది. ఇది వ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని ప‌లుమార్లు తెలియ‌జేసింది. ప‌లువురు భ‌క్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామి వారి ద‌ర్శనం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కి పంపుతున్నారు. 

వరంగల్ ఏనుమముల మార్కెట్ లో రైతుల ఆందోళన... మిర్చి ధర తగ్గించేశారని ఆగ్రహం

వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగారు.   మిర్చి ధర తగ్గించారని రైతులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజ మిర్చికి రూ.17,200 ఉంటే రూ.14 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని ఆందోళనలకు దిగారు రైతులు. ర్యాలీగా బయలు దేరి మార్కెట్  ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. మిర్చి యార్డు కార్యాలయంలో దూసుకెళ్లిన  రైతులు...సామాగ్రి ధ్వజం చేసే ప్రయత్నం చేశారు. రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 

బంగారుపాళ్యం మండలంలో ఏనుగులు హల్ చల్... 

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో ఏనుగులు హల్ చల్ చేశాయి. మొగిలి ఘాట్ లోని శ్రీని ఫుడ్స్ పరిశ్రమలోకి నిన్న అర్ధరాత్రి ఏనుగులు చొరబడ్డాయి. పరిశ్రమలో ఉన్న టమాటా ట్రేలను తొక్కి ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసి అప్రమత్తమైన పరిశ్రమ సిబ్బంది అటవీ శాఖ అదికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖా సిబ్బంది ఏనుగులను
కౌండిన్య అటవీ ప్రాంతంలోకి పంపివేశారు..


 


 

విజయనగరంలో ప్రారంభమైన శంభర పొలమంభ జాతర 

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంభరలో వెలసిన గిరిజన దేవత పొలమాంభ జాతర తోలేళ్ల ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు ఒడిశా, ఛతీస్ గఢ్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం ఆనవాయితీ. జాతరలో భాగంగా తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాలను సమర్పించడం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆంక్షల మధ్య పూర్తి పోలీస్ బందోబస్తుతో జాతర ప్రారంభమైంది.

నేడు గోదావరి యాజమాన్య బోర్డు కీలక సమావేశం

 గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ వర్చువల్ గా సమావేశం కానుంది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొంటారు. బోర్డు ఆధీనంలోకి ప్రాజెక్టులను తీసుకోవడంపై సమావేశంలో చర్చించనున్నారు. 


 

Background

తెలుగు రాష్ట్రాల్లో నేడు సైతం అకాల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.


కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 26 వరకు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం మరింతగా పెరుగుతోంది. అనంతపురంలో 17 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 



తెలంగాణలో వర్షాలు..


తెలంగాణలో అకాశం నిర్మలమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది.  కనిష్ట ఉష్ణోగ్రత 18.5 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నే కొన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు.





బంగారం, వెండి ధరలు




భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(సోమవారం) గ్రాముకి ఒక రూపాయి తగ్గింది. కానీ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,520 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.49,520గా ఉంది. 


ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే



  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630

  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.49,630

  • దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520

  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390

  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 

  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630


వెండిధరలు: 





భారత మార్కెట్ లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.64,900 ఉండగా, చెన్నైలో రూ.69,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.64,900 ఉండగా, కోల్‌కతాలో రూ.64,900, బెంగళూరులో కిలో వెండి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.




అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు


బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.