Breaking News Live: గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు చెప్పారు. తిరిగి శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.
దీపావళి పండగ వేళ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. తగ్గించిన ధరలను గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి నటుడిగా పేరు తెచ్చకున్నారు. అలాంటి స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఎయిర్ పోర్టు లో ఊహించని షాక్ తగిలింది. విజయ్ సేతుపతిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఎయిర్ పోర్టు లో దాడి చేశాడు.
మావోయిస్టు పార్టీకి చెందిన 20 మంది నక్సల్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సునీల్‌దత్ మీడియాకు వెల్లడించారు. చర్ల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 20 మంది ఏడాది కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారని తెలిపారు. వీరంతా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ నేతృత్వంలో పనిచేసే వారని తెలిపారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో చేస్తున్న వేధింపులకు తట్టుకోలేకపోయారని తెలిపారు. తరుచుగా తమను బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వీరిని వేధించేవారన్నారు. ఇటీవల వీరిని పెసర్లపాడు, పుట్టపాడు, చందా ప్రాంతాలకు ట్రైనింగ్ క్యాంపులకు పంపారని, అక్కడ ఇమడలేక పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. మిగిలిన మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఆదాం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఏమీ చేయలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురైన ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఏ ఒక్కరూ కారణం కాదని తనకు బతకాలని ఆశ లేదని ఈ విషయంలో తన కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనొద్దని, విచారణ పేరుతో పోలీసులు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కచేరీ వీధిలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉననట్లు సమాచారం. క్షతగాత్రులు సాయి, హరిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన తనయులు అరుణ్, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంటు నిర్మాణం కోసం రూ.2.11 కోట్లు తీసుకున్నారు. ప్రభు, అరుణ్ ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలతో సోమశేఖర్ రావు అనే వ్యక్తి సివిల్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ వరకూ డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది.
హుజూారాబాద్ ఉప ఎన్నికలో ఘోరమైన పరాభవం గురించి గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కీలకమైన నేతలంతా హాజరయ్యారు. ఉప ఎన్నికలో పరాభవానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. అయితే, ఉదయం పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానా రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన అక్కడి విలేకరులకు చెప్పారు.
నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 16 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. వారిని వెంటనే నిర్మల్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
Background
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రముఖ సినీ నటుడు విశాల్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని, ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు.. దీపావళి సందర్భంగా ‘ఎనిమి’ సినిమా విడుదల చేయనున్నాంమని, మా సినీమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయాం, అన్నయ్య సంకల్పం ఆగి పోకూడదు అని కోరుకున్నాని తెలిపారు.
Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
‘‘పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తా, నేను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించా. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చా’’రని విశాల్ గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కూడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పనీర్ సెల్వం., సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also Read: Kurnool Crime: బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?
Also Read: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -