Breaking News Live Updates: సరూర్ నగర్ లో బాలిక కిడ్నాప్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 May 2022 05:44 PM
సరూర్ నగర్ లో బాలిక కిడ్నాప్ 

హైదరాబాద్ సరూర్ నగర్ లో బాలిక కిడ్నాప్ అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఓ యువకుడిపై సరూర్ నగర్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలికను ఏమైనా చేస్తాడేమోనని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల పాప తల్లిదండ్రులు చనిపోవడంతో సరూర్ నగర్ లోని చిన్నమ్మ ఇంట్లో బాలిక ఉంటుంది. బాలికకు తీసుకెళ్లిన యువకుడిని వెంటనే పట్టుకొని తమ పాపని అప్పగించాలని కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి యువతి కనబడడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. 

KTTP: భూపాలపల్లి కేటీటీపీలో మరో ప్రమాదం- పదిరోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం

భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. కేటీపీపీ స్టేజ్‌-2 పంప్‌మోటార్‌లో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతో ముప్పు తప్పింది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం .

తెలంగాణ‌లో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ‌లో రాజ్యస‌భ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ విడుద‌ల చేసింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ త‌న రాజ్యస‌భ స్థానానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రాజ్యస‌భ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 12న కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వహించి, అనంత‌రం ఓట్లను లెక్కిస్తారు.

TTD News: శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి

శ్రీవారి మెట్టును నేటి నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అంతకు ముందు శ్రీవారి మెట్టు ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీవారి మెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు శ్రీవారి మెట్టు పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్డు తరహాలో మరమ్మత్తులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని దాదాపు 3.60 కోట్ల రూపాయలు ఖర్చు చేసామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు త్వరలోనే దివ్య దర్శనం టోకెన్లను అందిస్తామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Hindupuram: హిందూపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

* హిందుపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


* మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు


* అడ్డుకున్న పోలీసులు, ఆందోళన కారులకు పోలీసులకు మద్య తోపులాట వాగ్వాదం


* భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం


* హిందూపురం పట్టణంలోని బోయవీధిలో పురుగుల మందు తాగి తల్లి కొడుకు ఆత్మహత్యా యత్నం


* స్థలం పట్టా విషయంలో మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులు పురుగుల మందు తాగారని ఆరోపణ


* ఆ పట్టా ఫేక్ పట్టా అని మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇద్దరు వేధిస్తున్నాంటూ బాధితుల ఆరోపణ

CM Jagan Tirupati Tour: తిరుపతికి ముఖ్యమంత్రి జగన్ - విద్యా దీవెన నిధులు విడుదల

సీఎం జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ మైదానానికి వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్వీయూ తారకరామ మైదానానికి చేరుకొని అక్కడ విద్యాదీవెన బహిరంగ సభలో పాల్గొంటారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో మే 6వ తేదీన అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉండగా, ఆ తర్వాతి 24 గంటల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. విపరీతమైన ఎండల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.


కోస్తాంధ్రలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో మే 8 వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. నేడు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉండవచ్చని అంచనా వేశారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


తెలంగాణలో ఇలా Telangana Weather Updates
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ, రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదవుతోంది. మరోవైపు, నేడు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ఉంటాయని పేర్కొంది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. ఏకంగా 10 గ్రాములకు రూ.200 పతనం అయింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,280 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,000 కు తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.