Breaking News Live Updates: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమిత్ షా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Amit Shah Returns to Delhi: తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు కేంద్ర మంత్రి. తన జీవితంలో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చాయా అని ఈ సందర్భంగా అమిత్ షా ప్రశ్నించారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సబ్ ఇన్స్పెక్టర్ ముత్తవరపు గోపాల కృష్ణ మరణాన్ని రాజకీయం చేయడం ఆపండి. రాజకీయం చేయడానికి కొన్ని పరిధిలుంటాయాని గమనించాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ సూచించారు. ఎస్ఐ మరణించిన బాధలో పోలీస్ సిబ్బంది ఉంటే కొందరు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 2016 లో ఇదే విధంగా వ్యక్తిగత కారణాలతో పాడేరు ఏ.ఎస్.పీ మరణించడం జరిగింది. వాస్తవంగా 2019 ముందు డొంకరాయి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్.ఐకి రాజోలు, సర్పవరం, ట్రాఫిక్ వంటి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఉన్నత చదువు చదివి, సాఫ్ట్ వేర్ ఉద్యోగ నేపథ్యం నుంచి వచ్చిన ఎస్. ఐ.. పోలీస్ ఉద్యోగంలో ఇమేడలేక పోయారు. ఎస్ఐ మరణానికి పోస్టింగ్స్ కానీ, ఉన్నత అధికారులు వేధింపులు కానీ కారణం కానే కాదు. కొందరు రాజకీయ నాయకుల బాధ్యరాహిత్య వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణం ఈ వ్యాఖ్యలు ఆపవలసిందిగా కోరుతున్నామని ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.
Amit Shah On The Way To Tukkuguda: నోవాటెల్‌లో పార్టీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీలు ముగిశాయి. అనంతరం నోవాటెల్ నుంచి బీజేపీ సభ జరగనున్న తుక్కుగూడకు అమిత్ షా బయలుదేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రెండో దశ ముగింపు సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభను తుక్కుగూడలో నిర్వహిస్తోంది.
Amit Shah In Hyderabad: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని రామంతపూర్ కి చేరుకున్నారు. సెంట్రల్ డీటెక్టీవ్ ట్రైనింగ్ ఇన్స్ట్యూట్ కు అమిత్ షా వెళ్లారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ నూతన ల్యాబ్స్‌ను ఆవిష్కరించనున్నారు. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ ఏవేడెన్స్ డివైస్ ను లాంచ్ చేసిన కేంద్ర మంత్రి. దేశవ్యాప్తంగా ఉన్న 7 ఫోరెన్సిక్ లబరేటరీ లో హైదరాబాద్ ఒకటి. అమిత్ షా తో పాటు సెంట్రల్ డీటెక్టీవ్ ఇన్స్ట్యూట్ చేరుకున్న మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన రామంతపూర్ కి వెళ్లనున్నారు.
ప్రముఖ మిఠాయి దుకాణం పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డి పై గృహ హింస కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం ఏక్ నాథ్ రెడ్డికి భార్యకు గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కాగా ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు తాను ఇంట్లో ఉన్న రూమ్ లో ఒక అడ్డు గోడను రాత్రి కి రాత్రే నిర్మాణం చేసి అతను ఇంటికి తాళం వేసి పారిపోయాడని తన పిర్యాదు లో పేర్కొన్న ఏక్ నాథ్ భార్య. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు.
మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. మృతుల్లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు.
Background
Weather Latest News: నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి వాతావరణ విభాగం చల్లని కబురు వినిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించినదాని కన్నా ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు ఈ నెల 27న (4 రోజుల తేడాతో) కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. భారత రుతుపవన ప్రాంతంలో, దక్షిణ అండమాన్ ప్రాంతంలో ప్రారంభ రుతుపవనాల వర్షాలు కురిశాయి. రుతుపవనాల గాలులు రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా వాయువ్య దిశగా ముందుకు సాగుతాయి. రుతుపవనాల ప్రారంభం, పురోగతి ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీలు, అండమాన్ సముద్రం మీదుగా మే 22న పురోగమిస్తాయి. భూమధ్య రేఖను దాటి విస్తరించిన గాలులతో అనుబంధంగా, రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలో ప్రవేశించడానికి దాదాపు మే 15 తేదీకి పరిస్థితులు అనుకూలంగా మారతాయి.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, రంగారెడ్డి, వనపర్తి తదితర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో వాతావరణం ఇలా..
ఇక ఏపీలో తుపాను ప్రసరణ తీర ప్రాంతం సహా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఉపరితలం వరకూ వ్యాపించి ఉందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ ఏడాది త్వరగానే వస్తాయని అంచనా వేశారు.
ఇక రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. గాలులు కూడా వీయడం వల్ల ముఖ్యంగా అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు బాగా తగ్గింది. ఏకంగా పది గ్రాములకు రూ.750 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.1,600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,670 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.63,400 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.63,400 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,670గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.63,400 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -