Breaking News Live Updates: క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తాం: రోజా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
అసని తుపాను తీరాన్ని తాకింది. ప్రస్తుతం బాపట్ల వద్ద తీరాన్ని తాకింది, బందర్ వద్ద సైతం తుపాను తీరాన్ని తాకింది. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అసని తుపాను తీరాన్ని తాకనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను తీరాన్ని తాకడంతో తీరం వెంట బలమైన గాలులు వీస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసని తుపాను ప్రభాంతో ఉమ్మడి గుంటూరు, క్రిష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
తిరుపతి : క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి రోజా అన్నారు. గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నారు. వడమాలపేట మండలంలోని టిసీ అగ్రహారం, కల్లూరు పంచాయతీలోని మండల స్థాయి అధికారులతో కలసి గడప గడపకు వెళ్లి గత 3 సంవత్సరాల నుంచి అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం లో అధికారం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. పేపర్ లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రతి విషయానికి న్యాయస్థానం ద్వారా అడ్డుపడడం టీడీపీకి పరిపాటిగా మారిపోయిందని రోజా అన్నారు.
Cyclone Asani Helpline Numbers: అసని తుపాను నేపథ్యంలో హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే
విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహయం కోసం
24 గంటలు అందుబాటులో హెల్ప్ లైన్ నెంబర్లు
• 1070
• 18004250101
- డా.బిఆర్ అంబేద్కర్ , డైరెక్టర్ , ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
* రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే
* తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశం
* ఎంపీ రఘురామ పిటిషన్ పై ఈ నెల 6న విచారణ జరిపిన ఎన్జీటీ బెంచ్
* ఇప్పటివరకు తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీ నియమించిన ఎన్జీటీ
* ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్న ఎన్జీటీ
* నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశం
* తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదన్న ఎన్జీటీ
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధిలోని చల్లపల్లిలో దారుణం జరిగింది. భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులను కిరాతకంగా హత్య చేశారు. మృతులు కొత్త సాంబయ్య, లక్ష్మి దంపతులుగా గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* మన్యం జిల్లావ్యాప్తంగా ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం
* ఇళ్లకే పరిమితమైన ప్రజలు, ఈ రోజు జరగాల్సిన ఇంటర్ పరీక్ష రద్దు చేయడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
* పలు చోట్ల రోడ్లు జలమయం
* కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ నితీష్ కుమార్
* పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్
* పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయ అసని తుఫాన్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ నెంబరు 7286881293
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం చెందాడు. ఈయనది నల్గొండ జిల్లా. అమెరికాలోని మిస్సోరిలోని వారెన్స్‌బగ్‌లో ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి కిరణ్‌రెడ్డి (25) ఎంఎస్ చదివేందుకు గత ఏడాది వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లాడు. ఈయన వెళ్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
Background
కల్లోలం రేపుతున్న అసని తుపాను తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా ఏపీ విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ తెలిపారు. 'అసని' రేపు (మే 12) ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నానికి 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.
కొన్ని గంటల్లో ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది.
వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాక, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సహాయక చర్యలకు తొమ్మితి రాష్ట్ర విపత్తు నిర్వహణ టీమ్‌లు, మరో 9 జాతీయ విపత్తు నిర్వహణ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు బాగా తగ్గింది. ఏకంగా పది గ్రాములకు రూ.400 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,380 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,100 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -