AP SSC Result Live Updates: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి

ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్

ABP Desam Last Updated: 06 Aug 2021 05:22 PM
గ్రేడ్ల కేటాయింపుతో ఏ విద్యార్థికీ నష్టం జరగదు

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్లతో వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్‌ఏకు 50 శాతం, ఎస్‌ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేసినట్లు చెప్పుకొచ్చారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందని మంత్రి సురేశ్ వ్యాఖ్యానించారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరటంతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించించి గ్రేడ్లు ఇచ్చిందని చెప్పారు.

గ్రేడ్లు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం

గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు చెప్పారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లదన్నారు. కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి వివరించారు.

Background

ఏపీ పదో తరగతి ఫలితాలు మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేస్తున్నారు. రిజల్ట్స్ ను  www.bse.ap.gov.in వెబ్​సైట్​ ద్వారా చూసుకోవచ్చు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. అలాగే మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. కరోనా కారణంగా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా.. ఇటీవలే ఇంటర్‌ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో అందరినీ పాస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.