AP School Holidays Extends: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులను పొడిగించారు. జూన్ 13 వరకు వేసవి సెలవుల్ని పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆదివారం (జూన్ 9న) ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో పాఠశాలలు జూన్ 12న పున:ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ 13న స్కూల్స్ రీఓపెన్ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసిందే. మొదట జూన్ 9న చంద్రబాబు ప్రమాణం చేయాలని భావించారు. కానీ ఓవైపు ఎన్డీయే కూటమి చర్చలు, ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని అనుమతిని కోరారు. అందుకు ఆమె అంగీకారం తెలపడంతో నేడు (జూన్ 9న) నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ఉన్నందున చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం 12కి వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కేవలం ఒక్కరోజు స్కూ్ల్ సెలవులు పొడిగించాలన్న వారి వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, మరోరోజు సెలవు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.