AP MPTC ZPTC Elections 2021: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ABP Desam Last Updated: 16 Nov 2021 05:23 PM
Background
ఏపీలో వరుసగా మూడోరోజు ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం, సోమవారం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కారణాలతో గతంలో...More
ఏపీలో వరుసగా మూడోరోజు ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం, సోమవారం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కారణాలతో గతంలో ఆగిపోయిన చోట్ల, గెలిచిన అభ్యర్థులు మరణించిన స్థానాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను రీపోలింగ్ మొదలైంది. ఏపీ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.Also Read: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే ఛాన్స్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 954 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నేడు ఏదైనా అవకతవకలు జరిగితే బుధవారం రీ పోలింగ్ నిర్వహడానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థుల పేర్లు ప్రటిస్తారు. మొత్తం 7 వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.Also Read: టీడీపీ కంచుకోట బద్దలవుతుంది... దొంగ ఓట్ల సంస్కృతి వైసీపీకి లేదు... చంద్రబాబుకు సజ్జల కౌంటర్ మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో 4 జెడ్పీటీసీ, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. 3 ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్ జరుగుతున్న 10 జెడ్పీటీసీ స్థానాలకు 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో నిలిచారు. ఈనెల 18న ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేయనున్నారు. Also Read: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 14 జడ్పీటీసీ స్థానాలకుగాను నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీ స్థానలకు గాను 50 ఏకగ్రీవం అయ్యాయి.