v
AP Minister Venu : అసలే రోడ్లు పాడైపోయాయి. వర్షాలతో గుంతలే తప్ప రోడ్లు కనిపించని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లోనూ ఉద్దేశపూర్వకంగా రోడ్లను ధ్వంసం చేసేవారిని చూస్తే ప్రభుత్వంలో ఉన్న వారికి కోపం రాకుండా ఉంటుందా ? . వస్తుంది... వచ్చింది కూడా. ఇలా ఆగ్రహానికి గురైన ప్రభుత్వంలోని కీలక మంత్రి. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది రైతుల మీద. రోడ్లు పాడు చేస్తున్నారని ఆయన రైతులపై ఆగ్రహం చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇటీవల తన కాన్వాయ్‌తో వెళ్తూండగా కొత్తగా వేసిన రోడ్ల పై తిరుగుతున్న దమ్ము ట్రాక్టర్ ను చూసి కాన్వాయ్ ఆపి ఆ డ్రైవర్‌కు క్లాస్ పీకారు. ఏపీలో రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే,కొత్తగా వేసిన రోడ్ల పై ఇష్టాను సారంగా వ్యవసాయ ట్రాక్టర్లతో తిరిగేస్తున్నారంటూ ఒ రైతును మంత్రి నిలదీశారు.ఇలాంటి చక్రాలు వేసుకొని ట్రాక్టర్లు,ఇతర వాహనాలతో రోడ్ల మీదకు రావద్దంటూ ఆ రైతుకు మంత్రి క్లాస్ కూడా తీసుకున్నారు. రైతు కూడా రెండు చేతులతో దణ్ణం పెట్టి మరోసారి పొరపాటు చేయనంటూ హామీ ఇచ్చారు. దీంతో మంత్రి శాంతించారు.
ఆ వెంటనే అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఇలాంటి వాహనాలు తో ప్రజలు ఎవరూ రోడ్ల మీద తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడ ఆదేశించారు. ఇటీవలే కొత్తగా వేసిన రోడ్ల మీద దమ్ము చక్రాలతో వాహనాలు నడపటం వలన త్వరగా రోడ్లు పాడయిపోతాయి..దీని వలన కొత్తగా వేసిన రోడ్లు వెంటనే పాడయ్యాయనే ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే ఎపీలో రోడ్ల దుస్దితి పై ప్రభుత్వం పై భారీగా వత్తిడి పెరిగింది.ప్రతిపక్షాలు ఎకంగా సోషల్ మీడియా కేంద్రంగా డిజిటల్ క్యాంపెయిన్ ను నడిపిస్తుండటం,వివిధ రకాల ద్వంసం అయిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటంతో ప్రభుత్వం ప్రతిదానికి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది.
ఈ పరిస్దితుల నుండి బయటపడేందుకు సర్కార్ ,చేయని ప్రయత్నాలు అంటూ లేవు..దీన్ని ఆదారంగా చేసుకొని జరుగుతున్న ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ వర్గాలు పని చేస్తున్నాయి.అందులో భాగంగానేమంత్రి ఇలా తన కాన్వాయ్ లో వెళుతుండగా కనిపించిన ఘటన పై సీరియస్ గా స్పందించారు.వాస్తవానికి ఇలాంటి చక్రాలు ఉన్న వాహనాలు రోడ్ల పైకి తిరిగేందుకు అనుమతి లేదు. అయితే రైతులే అదికంగా ఈ వాహనాలను వినియోగిస్తుండటంతో వారిని ఎవ్వరూ కాదనలేక మిన్నకుండిపోతున్నారు. అయితే ఇప్పుడు రోడ్ల పైనే ఫుల్ టైం రాజకీయం నడుస్తుండటంతో మంత్రి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాద్యతలను గుర్తు చేసేందుకు ప్రయత్నించారు.