ఉద్యోగుల ఆందోళనలు, సహాయ నిరాకరణ అంశం కేబినెట్ దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెళ్లడించారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె స్పందిస్తూ... ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రులు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తన దృష్టి రాలేదన్నారు. ఉద్యోగులు రోడెక్కకూడదనే ప్రభుత్వం భావిస్తుందన్నారు. అయితే బాధలో ఉన్న ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ వేసి ఉండొచ్చని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు. న్యాయంగా పోరాటం చేస్తేనే ఏదైనా సాధించగలుగుతామన్నారు. సీఎంను తిడుతున్న ఉపాధ్యాయులు రేపు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?


కేబినెట్ నిర్ణయాలు 


కేబినెట్ భేటీలో కరోనా నియంత్రణపై  చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా మరణాలు తగ్గేలా చూడాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే ఏపీ మెరుగైన స్థితిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అగ్రవర్ణ మహిళలకు అండగా నిలిచేందుకు 45 నుంచి 60 ఏళ్ల వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే నిధులు రూ.580 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం ప్రారంభించనున్నట్లు ప్రకంచింది. రాష్ట్రంలో 16 వైద్య కళాశాల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!


కిదాంబి అకాడమీకి భూ కేటాయింపు


ఉద్యోగుల పదవీ విరణమ వయసు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. అలాగే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో ఉద్యోగులకు 10 శాతం, పింఛన్‌దారులకు 5 శాతం రిజర్వేషన్‌కు కల్పించాలని నిర్ణయించింది. కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను మరొకరికి అప్పగించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ నిర్వహణ ఖర్చు తగ్గించుకొనేందుకు 28 ఏళ్లపాటు అప్పగించాలని నిర్ణయించింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో మార్పులు చేయాలని కేబినెట్ భావించింది. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. అనకాపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా కోసం కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములను వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ అకాడమీ కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు దేవాదాయ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఐసీడీఎస్‌లో బాలామృతం, పాల సరఫరాను అమూల్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 


Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి