EX Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఆ రాష్ట్ర హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలోనే తాజాగా మంత్రి నారాయణతోపాటు మరికొందరికి ముందుస్తు బెయిల్ వమంజూరైంది. అభియోగ పత్రం దాఖలు చేసే వరకు దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అమరావతి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని అనుసంధానించే రహదారుల అలైన్ మెంట్ విషయమై అక్రమాలు జరుగుతున్నాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.


చంద్రబాబు, మంత్రితో పాటు మరికొందరిపై కేసులు


అయితే ఏప్రిల్ 27వ తేదీన వచ్చిన ఈ ఫిర్యాదు  ఆధారంగా మే 9వ తేదీన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయమ సహా వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఆయన సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌజింగ్ సంస్థ డైరెక్టర్ కె.పి.వి అంజనీ కుమార్ లపై సీఐడీ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నారాయణతో పాటు తదితరులు ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై గతంలోనే విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది  వాదనలు వినిపించారు. 


సీఆర్డీఏ చట్టం సెక్షన్ 164 ప్రకారం..


మంత్రి హోదాలోనే నారాయణ సమీక్షల్లో పాల్గొన్నారని, ఆ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకున్నారే తప్పు అలైన్ మెంట మార్పు విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయలేదని తెలిపారు. కేవలం రాజీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేవలం కాగితాలకే పరిమితం అయింది తప్ప ఏర్పాటే కాలేదన్నారు. మరి ఏర్పాటే కాని రహదాలితో అనుచిత లబ్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ పై ఆరోళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని అన్నారు. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 164 ప్రకారం.. సమష్టిగా తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వానికి, అధికారులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉందని తెలిపారు. వారిని విచారించడానికి కూడా వీళ్లేకుండా నిషేధం ఉందని పేర్కొన్నారు. 


కావాలనే సీఎం జగన్ ఇలా చేస్తున్నారంటూ..


సీఎం జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ నేతలు ప్రజల బాగోగులను గాలికొదిలేశారని అన్నారు. టీడీపీ నేతలపై అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణపై కేసు పెట్టారని అన్నారు. అక్రమ కేసులు, అరెస్టుల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.