కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ  మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ లోని అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. కేవలం తాను మాత్రమే కాకుండా తన భార్య, తండ్రి కలిపి మొత్తం మూడు టోకెన్ లు కొని అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు . క్యాంటీన్ లోని భోజనం క్వాలిటీ బాగుందని కలెక్టర్ ఫ్యామిలీ చెప్పింది. 


ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ ల నిర్వహణ


ఆగస్టు 15వ తేదీన ఏపీ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ను మళ్ళీ  ప్రారంభించగా ఆ తరువాతి రోజున  రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యే లు వారి వారి నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. తమ ప్రభుత్వ హయాం లో 2019 కు ముందు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ లపై మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా వాటినీ మూసివేశాక ప్రజల నుండి అన్నా క్యాంటీన్ లో కోసం డిమాండ్ పెరిగింది.


ముఖ్యంగా కోవిడ్ సమయం లో పనులు లేక డైలీ లేబర్ ,వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయం లో అన్నా క్యాంటీన్ లను తాము అధికారం లోకి వస్తే మళ్ళీ ప్రారంభిస్తాం అంటూ టీడీపీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టే 2024 ఎన్నికల్లో గెలిచాక 100 కు పైగా అన్నా క్యాంటీన్ లను మరో సంస్థ తో కలిపి నడుపుతోంది ఏపీ ప్రభుత్వం . దీనికోసం దాతల నుండి పెద్ద సంఖ్య లోనే విరాళాలు అందుతున్నాయి .


వచ్చేనెల నుండి మరో 75 అన్నా క్యాంటీన్ లను నడుపుతాం : మంత్రి నారాయణ


తాజాగా వచ్చే నెల 13 న మరో 75 అన్నా క్యాంటీన్ లను తెరపైకి తెస్తాం అంటున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ. దీనికోసం ప్రణాళికలు రెడీ అయ్యాయని ఆర్థికంగా సమస్యకు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అన్నా క్యాంటీన్ ల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
Also Read: Andhra Pradesh: సినర్జిన్‌ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: మంత్రి అనిత