ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. ఉగాదికి కొత్త జిల్లాల్లో పాలన చేపట్టాలని ప్రభుత్వం సీరియస్ గా ఉంది.  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల‌కు అద‌నంగా మ‌రో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే అభ్యంత‌రాలు, సూచనలు తీసుకుంటుంది. 


జిల్లాలో మార్పునకు డిమాండ్ 


ఏపీలో ప్రస్తుతం కొత్త జిల్లాల(New Districts) ఏర్పాటు వ్యవ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుపై సీఎం జ‌గ‌న్(CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా జిల్లాల ఏర్పాటుకు అవ‌స‌రమైన మౌలిక స‌దుపాయాలపై కూడ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై ప‌లు ప్రాంతాల్లో అభ్యంత‌రాలు వ్యక్తం అవుతున్నాయి. రెవిన్యూ కేంద్రాల(Revenue Centers) ఏర్పాటుతో పాటుగా జిల్లా కేంద్రాల ఏర్పాటుపై అభ్యంత‌రాలు తెల‌పుతున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాల‌కృష్ణ(Mla Balakrishna) ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం చేప‌ట్టారు. ఇక ప‌ల్నాడు ప్రాంతానికి న‌ర‌స‌రావు పేట జిల్లా ఏర్పాటుపై కూడా నిర‌స‌న‌లు వ్యక్తం అవుతున్నాయి. ప‌ల్నాడు జిల్లా(Palnadu District)ను ప్రత్యేకంగా ఉంచాల‌ని, న‌ర‌స‌రావుపేట‌తో సంబంధం లేకుండా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకుంటామ‌ని ప్రభుత్వం వెల్లడించింది. 


Also Read: ప్రజలంతా నాకు థాంక్స్‌ చెప్పాలి - హోదా అజెండా నుంచి తొలగించేలా చేసింది తానేనన్న జీవీఎల్ !


అభ్యంతరాలపై తుది నివేదిక 


ప్రజల అభ్యంతరాలు, సూచనలు ప‌రిశీలించి త‌గిన నివేదిక త‌యారు చేయాల‌ని, సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్(Notification) ఇస్తామ‌ని అధికారులు అంటున్నారు. ఇక ఏప్రిల్ 2 ఉగాది(Ugadi) నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాల‌ని భావిస్తున్నారు. దీంతో పాటు జిల్లాల్లో ఉద్యోగుల విభజన, ప్రమోషన్లు, సర్వీస్ ఇబ్బందులపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని పాలనా కార్యాలయాలు ఒకే చోట ఉండేలా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి(Central Government) సమాచారం ఇవ్వాల‌ని స‌ర్కార్ తలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రం అనుమతి అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం భావ‌న. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుందని అంటున్నారు.


Also Read: హోదా కోసం యుద్ధం ఎప్పుడు ప్రారంభిస్తారు జగన్ ?