AP government Volunteers : వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి గత ప్రభుత్వం అదనంగా ఇస్తున్న పేపర్ అలవెన్స్ ప్రతి రూ. రెండు వందలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనుగోలు చేయించేందుకు ఈ అలెవెన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండే వాలంటీర్లు విధుల్లో లేరు. 
ఇప్పుడు అధికారికంగా వారికి ఇచ్చే రెండు వందల అలవెన్స్ ను రద్దు చేశారు. 


వాలంటీర్లకు పేపర్ డబ్బులు ఇచ్చే జీవో ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం                      


నిజానికి వాలంటీర్లకు ఇస్తున్న పేపర్ అలవెన్స్ జీవోను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించింది.   వలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో  సవాలు చేసింది. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు.


సాక్షి సర్క్యూలేషన్ పెంచుకునేందుకే జీవో ఇచ్చారని ఆరోపణలు                          


అయితే ఇది అక్రమంగా సాక్షి పత్రిక సర్క్యూలేషన్ పెంచుకుంటున్నారని ఉషోదయా పబ్లికేషన్స్ ఆరోపించారు.  200 రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేసును ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సోమవారం వలంటీర్లపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది. వలంటీర్లకు రెండు వందలు ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  విచారణ తర్వాత అలాంటి జీవోలు ఎలా ఇస్తారని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 


ప్రభుత్వ పరంగా సాక్షి పత్రిక కొనుగోలు నిలిపివేత                                       


గతంలో ప్రభత్వ కార్యాలయాలు, యూనివర్శిటీలు , ఒక్కొక్క గ్రామ సచివాలయంలో రెండు కాపీలు చొప్పున సాక్షి పత్రికను పంపిణీ చేసేవారు.వారికి తోడు ప్రతి వాలంటీర్ కు డబ్బులిచ్చి కొనుగోలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సాక్షి పత్రిక కొనుగోలును తక్షణం నిలిపివేయాలని మౌఖికమైన ఆదేశాలు ... ఇచ్చారు . ఈ విషయం అధికారికమైన ఆదేశాలు ఉంటే.. వాటిని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.