AP Government has said division of districts News is wrong : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న 26 జిల్లాలను 30 జిల్లాలు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అది ఓ సామాన్యుడు ఇచ్చిన సలహా మాత్రమేనని దాన్ని చూపించి  కొన్ని  జిల్లాలను రద్దు చేయబోతున్నారని ప్రచారం చేస్తూ  సమాజంలో అశాంతి రేపే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు తెలిపింది. 






కొత్త జిల్లాల కసరత్తుపై ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం                                        


ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా ఎప్పుడూ ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ గత ఎన్నికల సమయంలో అల్లూరి జిల్లా విషయంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే జిల్లాల విభజన వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని వారి సరిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కసరత్తు చేయాలని అధికారులకూ సూచించలేదు. అయినా కొంత మంది అత్యుత్సాహంతో కొత్త జిల్లాల ప్రతిపాదనలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూండటంతో సమస్యలు వస్తున్నాయి. కొంత మంది వీటిని వైరల్ చేస్తున్నారు. 


అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !


సున్నితమైన అంశం కావడంతో విస్తృతంగా అనధికార వార్తల ప్రచారం                                          


రాజకీయంగా  సున్నితమైన విషయం కావడంతో.. ఇతర రాజకీయ పార్టీలు ఈ సూచనల్ని వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తూంటాయి. గత ప్రభుత్వం జిల్లాల ఏర్పాటును ఆషామాషీగా పూర్తి చేసిందని కనీస పరిశీలన పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కొన్నిచోట్ల నుంచి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. 


పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారా? ఐసీయూలో చికిత్స పొందుతున్నారా?


ముందుగా ప్రజల నుంచి సలహాలు తీసుకునే మార్పు, చేర్పులు               


జిల్లాలను విభజన చేయాలనుకుంటే ముందుగా ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఎవరు ఏం చెప్పినా సోషల్ మీడియా ప్రచారంగానే గుర్తించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.