AP government has given orders  continuing the general consent of the CBI :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి మరోసారి జనరల్ కన్సెంట్ జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సీబీఐ ఏర్పడింది. ఈ కారణంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ విచారణకు జనరల్ కన్సెంట్ జారీ చేయాల్సి ఉంటుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐ కు జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2018లో సీబీఐకి జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. అయితే జగన్ గెలిచిన తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పుడు చంద్రబాబుకు సీబీఐతో ఎలాంటి సమస్యలు లేవు.. ఎన్డీఏలో భాగంగా ఉన్నందున ఏపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


సీబీఐకి  జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉన్న  రాష్ట్రాలు                           


రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే సీబీఐ.. ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టడానికి లేదు. ప్రత్యేకంగా కోర్టు ఆదేశిస్తే మాత్ర.. ఈ ఉత్తర్వులు వర్తించవు. అయినప్పటికీ సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేస్తేనే సీబీఐ దర్యాప్తు ఉంటుంది. తాజాగా బెంగాల్  ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ ఎప్పుడో రద్దు చేసింది. అయినప్పటికీ కోల్ కతా డాక్టర్ కేసును సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని అనుకుంది. అయితే ఈ లోపు  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కూడా వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఒక వేళ రాష్ట్రం సిఫారసు చేయకపోయినా... హైకోర్టు ఆదేశించకపోయినా సీబీఐ సొంతంగా దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉండవు. 


ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక జనరల్ కన్సెంట్ ఉపసంహరించిన చంద్రబాబు                    


రాజకీయ ప్రత్యర్థుల వేటకు సీబీఐని కేంద్రం ఉపయోగించుకుంటోందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఈ కారణంగానే ఉపసంహరించారు. జనరల్ కన్సెంట్ లేకపోతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దాడులు చేయాలన్నా... ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కువగా నిఘా పెడుతుంది. అవినీతి అధికారుల్ని పట్టుకుంటుంది. 


జూలై ఒకటి నుంచే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు                            


తాజాగా ఉత్తర్వులు జూలై ఒకటి నుంచే అమల్లో ఉన్నాయని  ఏపీ  ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అయితే ఇవి కొనసాగింపు కాబట్టి.. ఈ ఉత్తర్వుల ప్రత్యేకత ఏమీ లేదని.. ఎప్పటిలాగే.. సీబీఐ ఏపీలోకి వస్తుంది. అయితే సొంతంగా కేసులు పెట్టే అవకాశం ఉండదు. కేంద్ర పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. మిగిలిన విషయాల్లో మాత్రం రాష్ట్రం సిఫారసు చేయాలి లేదా.. కోర్టులు ఆదేశించాలి.