Jagan Vs Pawan : వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. పవన్ వ్యాఖ్యలు మహిళలను కించ పరిచే విధంగా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో పిటీషన్ వేయాలని నిర్ణయించింది. వాలంటీర్లను కించ పరచే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై కోర్ట్ మెట్లు ఎక్కనుంది. మహిళల అక్రమ రవాణా కు వాలంటీర్లు పాల్పడుతున్నారని, ప్రజల డేటాను ఇతర సంస్దలకు అప్పగిస్తున్నారంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని పై వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు తమ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే దీని పై మరింత లోతుగా స్టడీ చేసిన ప్రభుత్వం న్యాయ పరంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల పని తీరు ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర లో భాగంగా పవన్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పవన్ కామెంట్స్ ను మిగిలిన ప్రతి పక్ష పార్టిలు కూడ ఫాలో అయ్యాయి.. అయితే దీని పై అధికార పక్షం తో పాటుగా వాలంటీర్లు అంతా మూకుమ్మడి గా తమ నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లు సేవా భావంతో పని చేస్తుంటే, పవన్ వారిని అవమానించే విధంగా మాట్లాడటం పై వాలంటీర్ల అంతా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వాలంటీర్లు చేసిన ఆందోళన వెనుక ప్రభుత్వం ఉందని , వారితో ప్రభుత్వమే నిరసనలు తెలిపే విధంగా ప్రేరేపించిందంటూ పవన్ కౌంటర్ ఇచ్చారు.. అంతటితో ఆగకుండా పవన్ మరింత సమాచారంతో వాలంటీర్లు, మహిళల మిస్సింగ్ లకు చెందని డేటాల ను కూడా బయట పెట్టారు.
మహిళల అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని, అందులో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబందించిన సమాచారం తనకు కేంద్ర నిఘా వర్గాల నుండి వచ్చిందని కూడ పవన్ స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యల పై మహిళా కమీషన్ కూడ అభ్యంతరం తెలిపింది. పవన్ కు మహిళా కమీషన్ నోటీసులు కూడ ఇచ్చింది. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ మాట్లాడారంటూ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభ్యంతరం తెలిపారు. వపన్ కు కేంద్ర నిఘా వర్గాల నుండి సమాచారం ఇచ్చంది ఎవరో చెప్పాలని కూడ ఆమె ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాలని భావిస్తోంది. కేవలం సంచలనం కోసమే పవన్ కామెంట్స్ చేశారని, అందులో వాస్తవాలు లేవని ప్రభుత్వం భావిస్తోంది. ఇష్టాను సారంగా ప్రభుత్వం పై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపేందుకే ప్రభుత్వం న్యాయ పరంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.