New liquor policy in AP : ఏపీలో మూడేళ్ల పాటు అమల్లో ఉండేలా కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమలు లోకి రానుంది. ఈ నెలాఖరుతో ఇప్పటి వరకు ఉన్న బార్ లైసెన్స్ ల గడువును ఆగస్టు వరకూ పొడిగించింది . రాష్ట్రవ్యాప్తంగా 840 బార్ లకు అనుమతి ఇచ్చింది. మూడు కేటగిరీలుగా ఫీజులు నిర్దారణ అయ్యాయి. 50వేలు, 5 లక్షలు, 5 లక్షల కు పైగా జనాభా ఉన్న ప్రాంతాలుగా ఫీజులు నిర్దారణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.
అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని జగన్ హామీ
అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. బ్రాండెడ్ మద్యం సరఫరా చేయకుండా ఇతర బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ బ్రాండ్లన్నీ జే బ్రాండ్లని వాటిలో విషపదార్థలున్నాయని టీడీపీ నేతలు ారోపణలు చేస్తున్నారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి ఇప్పుడుపెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వంఎలాంటిస్పందనవ్యక్తం చేయలేదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు మద్యం పైనే ఆదాయం గడించి ఖజానాను నింపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి.
పెద్ద ఎత్తున ధరలుపెంచి - కొత్త బ్రాండ్లు అమ్ముతున్న ప్రభుత్వం
అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ధరలు పెంచారు. ధరలు పెంచితే తాగే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని, తద్వారా దశల వారీగా మద్య నిషేదాన్ని అమలు చేసేందుకు వీలుంటుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా కీలకం. ఎన్నికలకు రెడీ అవుతున్న సమయంలో ప్రభుత్వం మరో సారి మద్యం పాలసిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. జనాబా ప్రాతిపదికన మూడు సంవత్సరాల పాటు, పాలసిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పుడు మూడేళ్ల బార్ పాలసీ విడుదల
వచ్చే ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేసి ఆ తర్వాతే ఓట్లు అడుగుతామని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రచారంచేశారు. సీఎం జగన్ కూడా పలుమార్లు చెప్పారు.అయితే ఇప్పుడు మద్యం ఆదాయంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకు వస్తూండటమే కాదు .. బార్ల విధానం కూడా మూడేళ్లకు ప్రకటించడంతో ఇక ఏపీలో మద్య నిషేధం.. మద్య నియంత్రణ అనేది ఉండదని భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పూర్తిగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పక్కన పెట్టినట్లేనని అంచనా వేస్తున్నారు.