AP Employees Transfers Deadline | అమరావతి: ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మరో అప్ డేట్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గడువును ఏపీ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం నాడు (ఆగస్టు 30న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ముగియకపోవడంతో బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబరు 15 వరకు ఎత్తివేశారు. బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ఉత్తర్వులలో పేర్కొన్నారు. 


ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై విధించిన నిషేధాన్ని రెండు వారాల కిందట ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, వివిధ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది బదిలీలకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31వ తేదీ లోపు బదిలీలు పూర్తి చేసి, మళ్లీ నిషేధాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. కానీ బదిలీ ప్రక్రియ పూర్తవకపోవడంతో, మరో పదిహేను రోజులపాటు గడువు పొడిగించారు. ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపడతారు. కానీ ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ  వాయిదాపడగా.. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీ చేపట్టింది.


Also Read: విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్