ఏపీలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు అక్టోబరు 18న ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు. గతంలో దసరాను ఐచ్ఛిక సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి మరో జీవోను విడుదల చేశారు. దీనికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్‌లోనూ మార్పులు చేసినట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకూ ఈ సెలవు వర్తిస్తుంది. అలాగే వ్యాపార సంస్ధలు కూడా నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం అదే రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.


మొదట అక్టోబర్ 23న విజయదశమి పండుగకు అధికారిక సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా అక్టోబర్ 23, 24న రెండు రోజులు దసరా సెలవులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల మార్పుతో ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలన్నింటికీ మొత్తం 11 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 24 విజయదశమి అనంతరం అక్టోబర్ 25న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని కాలేజీలకు కూడా దసరా సెలవులు వారం రోజులు ఉండనున్నాయి.




ALSO READ:


డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ ప్రవేశాలు, ముఖ్యమైన తేదీలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతోపాటు నీట్ యూజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...