అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని లోకేష్ కొనియాడారు. ఆయన చరిత్ర చిరస్మరణీయం. వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషిచేద్దాం అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.