Jagan VS Nara Lokesh: రాష్ట్రంలో విద్యాకానుక(Vidya Kanuka) పథకాన్ని తప్పకుండా అమలు చేసి తీరతామని విద్యాశాఖ మంత్రి లోకేశ్(Lokesh) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిందని పథకాలను తొలగించడం వంటి కక్షసాధింపు చర్యలకు తాము పాల్పడబోమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) సైతం ఇదే విషయాన్ని మంత్రులందరికీ చెప్పారని...గత ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకాలు ఏమైనా ఉంటే సమీక్షించి మరింత మిన్నగా అమలు చేయాలని చెప్పారే తప్ప...ప్రజలకు ఉపయోగపడే పథకాలను తొలగించొద్దన్నారని వివరించారు.
విద్యాకానుక కంటిన్యూ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక(Vidya Kanuka) పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండలిలో స్పష్టం చేశారు. అయితే పేదవిద్యార్థులకు ఇంకా మరింత నాణ్యమైన బట్టలు, షూ, బ్యాగులు అందిస్తామన్నారు. చదువుకునే పిల్లలపై ప్రభావం చూపేలా వాటికి మాత్రం పార్టీ రంగులు వేయమని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని...విద్యార్థులకు, పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ ప్రేరేపితం ఏమాత్రం ఉండకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని పుస్తకాలు, బ్యాగులకు పసుపు రంగు వేస్తే సహించేది లేదన్నామన్నారు. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించేలా...యూనివర్సల్ డ్రెస్‌కోడ్‌పై(Dress Code) అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం విద్యాకానుక కిట్లకు టెండర్లు లేకుండానే పనులు అప్పగించిందని వాటిపై విచారణ జరిపిస్తామని లోకేశ్ (Lokesh)తెలిపాడు. విద్యాకానుక కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని లోకేశ్ మండిపడ్డారు. తొలి ఏడాది ఒక్కో విద్యార్థికి 1500 రూపాయలు అయిన ఖర్చు ఐదో ఏటకు వచ్చేసరికి 2700 చేశారని దీనిపైనా విచారణ జరిపిస్తామన్నారు.
Also Read: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
పుస్తకాల బరువు పెంచేశారు
ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండానే ఇంగ్లీష్‌మీడియం(English Medium) పేరు చెప్పి గత ప్రభుత్వం విద్యార్థులను అయోమయానికి గురిచేసిందని లోకేశ్ విమర్శించారు. దీనికోసం ఒక్కో పుస్తకం రెండు భాషల్లోనూ ముద్రించాల్సి రావడంతో బరువు పెరిగిపోయి విద్యార్థులు మోయలేకపోతున్నారని లోకేశ్ విమర్శించారు. అలాగే బైజూస్(Byjus) కంటెంట్‌పైనా, వారు అందించిన ట్యాబ్(TAB)లపైనా చాలా విమర్శలు వస్తున్నాయని దీనిపైనా సమీక్షిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న లోకేశ్ అందుకే...సీఎం తొలిసంతకమే డీఎస్సీ(DSC)పై పెట్టారన్నారు. ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. చదువుకుని స్కిల్క్స్ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పెద్దఎత్తున ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే సంస్థలు....వారు ఏ మేరకు పెట్టుబడి పెడతారన్నది కాకుండా...ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారన్న ప్రాతిపదికనే రాయితీలు ఇస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కువ రాయితీలు ఇస్తామని వివరించారు.
ఢిల్లీలో జగన్ గగ్గోలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని రెండు నెలలు కాకముందే జగన్(Jagan) ఢిల్లీలో గగ్గోలు పెట్టడం చూస్తే ఆశ్చర్యమేస్తోందని లోకేశ్ అన్నారు. ఇక తన వద్ద ఉన్న రెడ్‌బుక్(Redbook) తెరిస్తే ఏమైపోతాడోనని చురకలంటించారు. అయితే రెడ్‌బుక్‌లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ చట్టప్రకారం శిక్షించి తీరతామని ఇందులో ఎలాంటి రాజీలేదని లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లకాలంలో కనీసం ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టని జగన్....ఓడిపోయి 11 సీట్లకు పరిమితం కాగానే మీడియా గుర్తుకు వచ్చిందన్నారు. ఢిల్లీలో జాతీయమీడియాను బ్రతిమిలాడి ప్రెస్‌మీట్‌కు రావాల్సిందిగా వేడుకోవడం చూస్తుంటే జాలేస్తుందన్నారు.
Also Read: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం