AP Farmers News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు అత్యవసర హెచ్చరిక లాంటి వార్త ఇది. సెప్టెంబర్ 30వ తేదీ (రేపు) ఈ-క్రాప్ బుకింగ్‌కు చివరి రోజు కానుంది. కేవలం ఒక్క రోజే మిగిలి ఉండటంతో, రైతులు తమ పంటలను తక్షణమే నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యం చేసినట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు వారికి అందకపోవచ్చు.

Continues below advertisement

పథకాల లబ్ధి కోసం ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిమన దేశం వ్యవసాయాధారిత దేశం అయినందున, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వాతావరణ బీమా, పీఎం పంట బీమా వంటి పథకాలు రైతులకు సహాయం చేస్తాయి. అయితే, ఈ పథకాల లబ్ధిని పొందాలంటే, ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయాలి.

రైత్యులకు అవసరమైన సూచనలుఈ-క్రాప్ ప్రక్రియను పూర్తి చేయడానికి, రైతులు కొన్ని ముఖ్యమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ మరియు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అలాగే, పంటలు వివిధ విభాగాలకు చెందినవి కావడంతో, అవసరమైన అధికారుల వద్ద పంట నమోదు చేయాలి. వ్యవసాయ పంటలు కోసం మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలు కోసం హార్టికల్చర్ అధికారి, ప్రభుత్వ భూముల పరిశీలన కోసం తహసీల్దార్ బాధ్యత తీసుకుంటారు.

Continues below advertisement

ఈ-క్రాప్ కేవైసీరైతులు ఈ-క్రాప్ కేవైసీ పూర్తి చేయడం కూడా అవసరం. ఈ ప్రక్రియ పూర్తయితే, పంటలు ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఉంటాయి. పంట నష్టాలు, భారీ వర్షాలు, వర్షాభావం లేదా తుపానులు వంటి పరిస్థితుల్లో రైతులకు బీమా సాయం అందించబడుతుంది. అయితే, ఈ సాయం పొందేందుకు, రైతులు తమ పంట వివరాలను ముందుగా ఈ-క్రాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.

కనుక, సెప్టెంబర్ 30 (రేపటితో) ఈ-క్రాప్ బుకింగ్ కు చివరి తేదీ కనుక రైతులు ఆలస్యం చేయకుండా ఈ పని పూర్తి చేసుకుంటే సబ్సిడీలు, పెట్టుబడి సాయం, బీమా వంటి ప్రయోజనాలను పొందుతారు. అందువల్ల, రైతులు తప్పకుండా తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి.

రైత్యులకు ముఖ్యమైన సూచనలు:రైతులు తమ పంట వివరాలు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి.వ్యవసాయ పంటలు: మండల వ్యవసాయ అధికారిఉద్దాన పంటలు: హార్టికల్చర్ అధికారిప్రభుత్వ భూముల పరిశీలన: తహసీల్దార్అలాగే, ఈ-క్రాప్ కేవైసీ పూర్తి చేయడం కూడా అవసరం