Heat Waves in AP: ఐఎండీ సూచనల ప్రకారం బుధవారం 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 175 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 67 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 213 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రాబోయే నాలుగు రోజుల పాటు కింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
☀ ఏప్రిల్ 17 బుధవారం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు,నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ ఏప్రిల్ 18 గురువారం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి,చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ ఏప్రిల్ 19 శుక్రవారం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ ఏప్రిల్ 20 శనివారం
అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2°C, అనకాపల్లి జిల్లా రావికమతం 45.1°C, మన్యం జిల్లా మక్కువలో 44.4°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 44.3°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 43.9°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 43.8°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 88 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (46)
శ్రీకాకుళం 12 , విజయనగరం 18, పార్వతీపురంమన్యం12, విశాఖపట్నం, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(175)
శ్రీకాకుళం 11 , విజయనగరం 6, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు 12, విశాఖపట్నం 3,
అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 1, తిరుపతి 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.