YS Sharmila Politics | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే అంశంపై అధిష్టానం దృష్టిపెట్టనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో పార్టీ అధికారంలో ఉండటంతో దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని చురుకుగా పనిచేసేలా.. పార్టీ ప్రస్తుత కార్యకర్తల్లో ఓ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోంది. 

Continues below advertisement

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిళకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం దృష్టిలో పలువురు నేతలున్నా షర్మిలకే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు కేవీపీ రాంమచందర్రావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి లాంటి విధేయులు రేసులో ఉన్నప్పటికీ వారి వయోభారం రిత్యా.. వచ్చే ఎన్నికల నాటికి కూడా చురుకుగా పనిచేసే నాయకులకోసం పార్టీ చూస్తోంది. షర్మిల వైఎస్ కుమార్తె గా మాత్రమే కాకుండా..  ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలిగా,  పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేస్తుండటం, మీడీయాలో ఎంతో కొంత చోటు దక్కించుకునే పాపులారిటీ ఉండటం, అన్నిటికన్నా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే షర్మిళకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Also Read: DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్

Continues below advertisement

కర్ణాటక నుంచే అవకాశం.. 

ప్రస్తుతం కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.  నాలుగులో బీజేపీ కీ ఒక స్థానం పోగా మిగిలిన మూడు స్ధానాలు కాంగ్రెస్ కు దక్కుతాయి. మూడింట్లో ఒక స్ధానం పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేకు ఖాయం. మిగిలిన రెండు స్ధానాల్లో ఒకటి ఏపీకి ఇవ్వాళన్న నిర్ణయంలో కాంగ్రెస్ ఉంది.  జూన్ 8 నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అవుతుండటంతో అక్కడి పార్టీ అభ్యర్ధులపై కాంగ్రెస్ లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే వైఎస్  షర్మిళ ఈరోజు రాహుల్ గాంధీని కూడా కలిశారు. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్యకూడా తాను రాజ్య సభకు వెళ్లే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడం షర్మిళకు మరింత అనుకూలంగా మారింది. 

షర్మిళకు గాంధీ కుటుంబం అనుకూలం. వైఎస్ జగన్ పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గా మారిపోయింది. ఆయన అభిమానులను తిరిగి కాంగ్రెస్ గూటికి తెచ్చుకునేందుకు షర్మళ ఓ అవకాశం గా కనిపిస్తోంది. అందులో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు ఆమెకు రాజ్యసభ ఇచ్చేందుకు అనుకూలంగా వున్నారని తెలుస్తోంది. కర్నాటకలోని ఇద్దరు కీలక నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో షర్మిళకు మంచి సంబందాలున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవీపీ, రఘువీరాలతో పోల్చుకుంటే షర్మిళ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు

కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి తమవైపుకు తిప్పుకోవడం, ప్రస్తుత పార్టీ నాయకులను కాపాడుకోవడం లాంటి పలు సవాళ్లు షర్మిళముందున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిళకు మించిన బలమైన నాయకత్వం ఏపీలో కనిపించడంలేదు.. జగన్ పార్టీని తట్టుకుని నిలబడాలన్నా, వైఎస్ వారసత్వం కాంగ్రెస్ తోనే ఉందన్న వాదన అన్నీ వైఎస్ షర్మిళకు కలిసొస్తున్నట్టు సమాచారం.