Only Three MPs For Jagan Party :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  రోజు రోజులుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఊపు పెంచకుంటూ పోతోంది. నిన్నా మొన్నటిదాకా అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది  కూడా ఎవరూ పట్టించుకోలేదు. అభ్యర్థుల్ని నిలబెట్టినా నిలబెట్టకపోయినా పెద్దగా తేడా ఉండదని ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే  షర్మిల ఏపీసీసీ  చీఫ్ గా నియమితులయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీ నేతలు చేసే ప్రతి కామెంట్ హైలెట్ అవుతోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్  గా మాణిగం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన తెలంగాణలో పని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఆయనను ఏపీకి నియమించారు. షర్మిల దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్వహిస్తన్న కార్యక్రమాల్లో మాణిగం ఠాగూర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. 


వైసీపీకి ముగ్గురే ఎంపీలు మిగులుతారా ? 


మాణిగం ఠాగూర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేశారు.  జగన్ పార్టీకి కేవలం ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. మాణిగం ఠాగూర్ ప్రకటన సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. ప్రస్తుతం ఉన్న ఎంపీలందరూ పార్టీకి గుడ్ బై చెబితే.. చివరికి ముగ్గురు ఎంపీలు మిగులుతారా లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంటుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇతర వివరాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. టిక్కెట్ల కసరత్తులో భాగంగా  జగన్ మోహన్ రెడ్డి ఎంపీల విషయంలో కీలక నిర్మయాలు తీసుకుంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే మళ్లీ టిక్కెట్ కేటాయిస్తున్నారు.     


ఎంపీలందర్నీ మార్చేస్తున్న సీఎం జగన్          


ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం, నర్సరావుపేట ఎంపీలు రాజీనామా  చేశారు. విజయనగరం, అరకు, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు ఇలా అనేక  నియోజకవర్గాల ఎంపీ టిక్కెట్లను మార్చేశారు ఇప్పటి వరకూ ఎంపీ టిక్కెట్లు ఫలానా వారికి ఖాయం అని వైసీపీ నుంచి ప్రకటన రాలేదు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డిలకు మాత్రమే ఖాయమని ఇంకెవరికీ ఎన్నికల వరకూ గ్యారంటీ ఉండదని చెబుతున్నారు. ఈ లెక్కలేసుకుని మాణిగం ఠాగూర్ కామెంట్లు చేశారా లేకపోతే.. ఇప్పుడు ఉన్న 22 మంది ఎంపీల్లో 19 మంది పార్ట ఫిరాయిస్తున్నారని చెబుతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎప్పుడో ఓ ఎంపీ దూరమయ్యారు.                  


వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి చెప్పారా ? 


అయితే మాణిగం ఠాగూర్  వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి  పెట్టారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం అందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని.. కుప్పకూలిపోతున్న వైసీపీ కోట అన్న పద్దతిలో చెప్పారని అంటున్నారు.  మాణిగం ఠాగూర్ మాత్రం ఈ ఊహాగానాలను అలా వదిలేశారు. ఆయన ఏ  సోర్స్ తో ఈ ప్రకటన చేశారన్నది మాత్రం చెప్పడం లేదు.