AP Cm YS Jagan: కౌంటర్ అటాక్ గట్టిగా ఉండాలి.. ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో మంత్రులు రాజీ పడకుండా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే విషయంలో జోష్ మీద ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.


కౌంటర్ స్టేట్ మెంట్లలో దూకుడు పెంచాలి...!
’ఎట్టి పరిస్దితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండకూడదు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పైనే ఫుల్ ఫోకస్ ఉండాలి... వాటి పైనే చర్చ జరిగేలా ప్లాన్ చేయండని’ సీఎం జగన్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం పై ఎలాంటి  విమర్శలు చేసిన వెంటనే తిప్పికొట్టాలని  సీఎం  జగన్  సూచించారు. అవసరం  అయితే  ఆధారాలు చూపించి, మరీ  జవాబివ్వాలని  మంత్రులకు, పార్టీ కీలక నేతలకు  సూచిస్తున్నారు సీఎం జగన్. దీని వలన వాస్తవాలు ఎంటనే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదలకు కలుగుతున్న లబ్ది వంటి అంశాల పై పూర్తి స్దాయిలో అవగాహన వస్తుందన్నది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ విషయంలో పూర్తి బాధ్యతలను మంత్రులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు ఇక పార్టి పరంగా మంత్రులు ఫుల్ ఫోకస్ పెట్టి, ఏప్పటికప్పుడు తాజా రాజకీయ పరిణామాల పై ప్రభుత్వాన్ని, పార్టిని అలర్ట్ చేసే విధంగా కార్యకలాపాలు ఉండాలని చెబుతున్నారట. 


ఎన్నికలకు స్పీడ్ గా రెడీ కావాలి...
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్  స్పీడ్ పెంచుతున్నారు. ప్రభుత్వం  అమలు  చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎవరు  అనవసర విమర్శలు చేసినా సహించద్దని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులకు స్పష్టం ఇస్తున్నారట. అదే సమయంలో ప్రభుత్వ పరంగా అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమయిన ఆదేశాలు ఇస్తున్నారు. లోపాలు లేకుండా, అవినీతి లేకుండా, నేరుగా లబ్దిదారులకు సంక్షేమాన్ని అందిస్తున్నప్పుడు ప్రభుత్వంలోకీలకంగా ఉండే అధికారులు సైతం తప్పుడు ప్రచారలను ఖండించాల్సిన అవసరం ఉందన్నది జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. సంక్షేమ పథకాలు, టిడ్కో  ఇళ్ళు, అందరికి  ఇళ్ళు వంటి అనేక  అంశాల్లో ప్రభుత్వంపై  ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు  చేస్తున్నారు. అయితే వీటిని సమర్దవంతంగా ధీటుగా ఎదుర్కోవటానికి ప్రత్యేకంగా టీం ఉండాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. పార్టి తరపున అధికార ప్రతినిదులు ఉన్నప్పటికి వారికి పూర్తి స్దాయిలో సరైన సమాచారం అందకపోవటం, వలన ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వటం సాధ్యం కావటం లేదు. అదే మంత్రులు అయితే, అటు అధికార పక్షం, ఇటు పార్టి నేతలు సైతం టచ్ లో ఉంటారు కాబట్టి, వారే కౌంటర్ ఇవ్వటం ద్వార ప్రజల్లోకి వెళ్ళే సమాచారం కూడ నాణ్యతగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆరోపణలు, అసత్య ప్రచారాలు తెర మీదకు వచ్చినప్పుడు వాటిని వెంటనే ఖండిచలేని సందర్బంలో తప్పుడు సంకేతాలు వేగంగా ప్రజల్లోకి వెళుతున్న విషయాలు గమనించాలని సీఎం మంత్రులకు సూచిస్తున్నారు.


ప్రజల్లోనే తేల్చుకుందాం...
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై  జనంలో ఎక్కువగా  చర్చ  జరగాలనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.  అయితే  ప్రతిపక్షాలు  అనవసర విమర్శలు చేస్తున్నాయనే  ఆలోచనలో ప్రభుత్వం పార్టీ వర్గాలున్నాయి. ఈ  విమర్శలకు మంత్రులు  అధికారులు  సబ్జెక్ట్  వారీగా  ధీటుగా  సమాధానం  చెప్పడానికి  వైసీపీ  రెడీ  అయ్యింది. సంక్షేమ కార్యక్రమాలు అనవసరం అంటూనే టీడీపీ  మరో  పక్క మేనిఫెస్టోలో లెక్కకు  మించి  హామీలు  ఇస్తున్నారని  జగన్  చెప్తున్నారు. రాష్ట్రం శ్రీలంక  అవుతుందని  చెప్పి ఇప్పుడు  టీడీపీ  ఇస్తున్న  హామీలపై  కూడా  జగన్  విమర్శలు  మొదలుపెట్టారు. కేజీ బంగారం....  బెంజి కార్  ఇస్తామని బాబు  చెప్తారని  అయినా నమ్మవద్దు  అంటున్నారు జగన్. మొత్తానికి  అటు మేనిఫెస్టో అంశం ఇటు ప్రభుత్వ  కార్యక్రమాలపై  విమర్శలు  చేస్తే  తిప్పి కొట్టేందుకు వైసీపీ  పార్టీ  ప్రభుత్వ  వర్గాలు రెడీగా ఉన్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial