వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చేనేత కార్మికులకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. నేతన్న నేస్తం మూడో విడత కింద 80 వేల 32 మంది ఖాతాలల్లో రూ. 192 కోట్లు జమచేస్తున్నారు. అర్హులైన నేతన్నలు ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేలు అందించనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపింది. మూడో విడత ఆర్థిక సాయంతో కలిపి మొత్తంగా రూ. 576 కోట్లు లబ్ధిదారులకు అందించినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.




'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్థిక సాయం కింద నేతన్నల అకౌంట్లలో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని సీఎం జగన్ అన్నారు. 


సుమారు 80 వేల మంది లబ్దిదారులకు రూ. 192.08 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీ చేనేత కార్మికునికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తన పాదయాత్రలో చేనేత కష్టాలను చూశానని సీఎం అన్నారు. 




మగ్గం కలిగిన, అర్హులైన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.48 వేలు సాయం అందించారు. తాజాగా మూడో విడత ఆర్థిక సాయాన్ని  అర్హుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించారు. మూడో విడతతో కలిపి అర్హులైన ప్రతీ నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందజేసింది. ఇవాళ మూడో విడత కింద రూ.192.08 కోట్లు నేతన్నలకు అందిస్తు్న్నారు. 


నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులపై వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ఉంచుతారు. ఒకవేళ అర్హులకు ఈ పథకం ద్వారా సాయం అందకపోతే వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులైతే సాయం తక్షణమే అందేలా చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు తమ పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది.