White Paper On Financial Status Of Andhrapradesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఆదాయ వనరులు బాగా తగ్గాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని.. 2019లో టీడీపీ అధికారంలో కొనసాగుంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. 'రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 52 శాతం ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 2014 - 19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపాం. రూ.16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయి.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.


'అభివృద్ధి చేసుంటే..'


 విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో పింఛన్లు సైతం రావనే పరిస్థితులు నెలకొన్నాయని.. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. 'ప్రముఖ కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిసివచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీరందుతుంది. టీడీపీ హయాంలో రూ.1667 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ హయాంలో పట్టిసీమను సరిగ్గా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం.' అని చంద్రబాబు వివరించారు.


Also Read: Jagan : "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత