Case On Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగిస్తోంది. రోజు మార్చి రోజు కేసు నమోదు చేస్తోంది. తాజాగా ఇసుక విషయంలో ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ కేసు నమోదుచేశారు. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
పశువుల కొనుగోలు పేరిట రూ.2 వేల కోట్లకు పైగా భారీ స్కామ్? - ప్రభుత్వంపై నాదెండ్ల సంచలన ఆరోపణలు
చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపించారు. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదని... ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని సీఐడీ తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారని సీఐడీ తెలిపింది. ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు భిన్నంగా ఉందన్నారు. ట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారని సీఐడీ తెలిపింది. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టలేదన్నారు. ఈ కేసులో దేవినేని ఉమను కూడా చేర్చారు. ఆయన జలవనరుల మంత్రిగా ఉన్నారు.
వైసీపీ పాలనపై ఎంపీ రఘురామ పిటిషన్ - అవినీతిపై విచారణ కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం
రెండు రోజుల క్రితం మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని సీఐడీ ఓ కేసు పెట్టింది. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్లకు అక్రమంగా అనుమతి ఇచ్చారని కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలకు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఆరోపిస్తూ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలపై సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. వాసుదేవరెడ్డి ఈ నెల 11న ఫిర్యాదు ఇవ్వగా.. 28న సీఐడీలో కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ అధికారులు సోమవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. తాజా కేసును కూడా ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించనున్నారు.
చంద్రబాబుపై ఇప్పటికి ఆరు కేసులు నమోదు చేశారు. స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టులో స్కాం జరిగిందని ఆరోపించి అరెస్టు చేశారు. తనపై కేసులన్నీ అక్రమం అని తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు రావాల్సి ఉంది. ఈ లోపే.. రెండు రోజులకో కేసు నమోదు చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని కేసుల్లోనూ డబ్బులు దుర్వినియోగం అయ్యాయని.. ప్రభుత్వానికి నష్టం జరిగిందని వాదిస్తున్నారు కానీ.. ఫలానా ఆర్థిక లబ్ది చంద్రబాబుకు కానీ.. ఇతరులకు కానీ అందిందని నిరూపించలేకపోతూడటంతో సీఐడీ, ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.