Gadikota Srikanth Reddy comments: దేశంలో సీనియర్ నాయకుడని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్ల ఏపీకి ఒరిగిందేమి లేదుని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దివంగత నేత, స్వర్గీయ ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు పరిస్తే.. మళ్లీ మద్యాన్ని రాష్ట్రంలో ఎరులుగా పారించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కడపలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.


రాజకీయ పదవి కాంక్ష కోసం సొంత మామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రజలను కడప రౌడీలు, గుండాలు అని మాట్లాడిన సంస్కారం చంద్రబాబు సొంతమని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నానిపై బురద జల్లే ప్రయత్నాలు టీడీపీ నేతలు చేస్తున్నారని, రాష్ట్రంలో పేకాట క్లబ్ లు, పబ్ లు మూయించిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. సంస్కృతి లో భాగంగా కోస్తా జిల్లాల్లో ఆనవాయితీగా వస్తున్న సంక్రాంతి సంబరాలను కూడా చంద్రబాబు తమ పచ్చ కళ్లతో చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.


‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఐ.ఆర్ 27 శాతం ఇచ్చిన ఘనత జగన్ సొంతం. కొత్త పీఆర్సీ లో 10 వేల కోట్లు భారం పడుతున్నా వెనక్కి తగ్గకుండా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్.ఆర్.ఏ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పాలసీని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. సీఎం వైఎస్ జగన్‌ను అగౌరవ పరిచేలా కొంత మంది యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. టీవీలలో చూపిస్తున్నారని సీఎంపై ఇష్టానుసారంగా ఉపాధ్యాయులు మాట్లాడటం తగదు. అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ మాట తప్పని మడమ తిప్పని నేత సీఎం జగన్. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు విఫలం అయ్యారు. చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి ఉద్యోగులను వాడుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు ఎందుకు అని కొంత మంది మాట్లాడుతున్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు మానుకోవాలి. ఓ కేంద్ర మంత్రి మతతత్వాన్ని పెంచాలని చూస్తున్నారు. ఏపీలో బీజేపీ లేనే లేదు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని టీడీపీ, బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నాయి. సీఎం జగన్‌ను, కొడాలి నానిని చంపుతామంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరాచకంగా మాట్లాడుతున్నారని’ శ్రీకాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.


Also Read: Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి


Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి