Breaking News Live: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 19 Mar 2022 10:36 AM
Background
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం పలు దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. రూ160 మేర పెరగడంతో హైదరాబాద్‌లో తాజాగా 22...More
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం పలు దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. రూ160 మేర పెరగడంతో హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,760 కి ఎగబాకింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.600 మేర పుంజుకోవడంతో నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,900 కు చేరింది.ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు మూడు రోజుల తరువాత నేడు పెరిగాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 18th March 2022) 10 గ్రాముల ధర రూ.51,760 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి చేరింది. విజయవాడలో వెండిపై రూ.600 తగ్గడంతో 1 కేజీ ధర రూ.72,900 కి పతనమైంది. విశాఖపట్నం, తిరుపతిలో రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.72,900 అయింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీన తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ఉక్కపోత అధికం కానుంది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. కొన్నిచోట్ల వడగాల్పులు వీచడంతో ఉక్కపోత అధికం. ప్రజలు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ (Petrol Price Today 18th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు దిగొచ్చింది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. వరంగల్‌లో 46 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.కరీంనగర్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. విజయవాడలో పెట్రోల్ పై 56 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.91 కాగా, ఇక్కడ డీజిల్ పై 52 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.96 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 50 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 46 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51గా ఉంది. చిత్తూరులో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. పెట్రోల్ పై 72 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.46కి పతనమైంది. డీజిల్ పై 64 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.52 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Karnataka Bus Accident: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!
కర్ణాటకలో YNH కోట నుంచి పవగడకు వెళుతున్న SVT బస్సు బోల్తా పడింది. దాదాపు 15 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.