Breaking News Live: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కొ అడుగు ముందుకెస్తుంది. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు ఆహ్వానం పలుకుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కొ అడుగు ముందుకెస్తుంది. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు ఆహ్వానం పలుకుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.
యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు.
కర్నూలు జిల్లా.....
నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పుడ్ పాయిజన్
నంద్యాల విశ్వనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత.
చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్య శాలకు తరలింపు.
అదోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు.
నంద్యాల ఆసుపత్రిలో విద్యార్థులకు కొనసాగుతున్న వైద్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు అయింది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసినట్లుగా తెలుస్తోంది.
కరోనా సమయంలో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ పథకం వల్ల ఇప్పటివరకూ 298 మంది పిల్లలు లబ్ధి పొందారని ఆర్థిక మంత్రి అన్నారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ నాయకులు అడ్డు తగిలారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ ప్రసంగం సమయంలో బుగ్గన ప్రకటిస్తున్న అంకెలను టీడీపీ నేతలు తప్పు బట్టారు. బడ్జెట్ అంతా తప్పుల తడక అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని వారిని గట్టిగా వారించే ప్రయత్నం చేశారు. ప్రసంగం సమయంలో ఆటంకం కలిగించవద్దని కోరారు. ఇది సాంప్రదాయం కాదని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు బడ్జెట్ పై శ్రద్ధ లేకపోతే వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. అయినా టీడీపీ నేతలు శాంతించకుండా వాదనలు కొనసాగించడంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
* రైతు భరోసా - రూ.3,900 కోట్లు
* పంట బీమా - రూ.1802 కోట్లు
* సున్నా వడ్డీ పంట రుణాలు - రూ.500 కోట్లు
* ఆర్బీకేలకు - రూ.18 కోట్లు
* ధరల స్థిరీకరణకు - రూ.500 కోట్లు
* రైతులకు విద్యుత్ సబ్సిడీకి - రూ.5 వేల కోట్లు
* పశుసంవర్థకశాఖ - రూ.1,568.83 కోట్లు
* వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా - రూ.6,400 కోట్లు
* వైఎస్ఆర్ చేయూత - 4,235.95 కోట్లు
* వైఎస్ఆర్ పెన్షన్ కానుక - 18 వేల కోట్లు
* వైఎస్ఆర్ బీమా - రూ.372.12 కోట్లు
* వాహన మిత్ర - రూ.260 కోట్లు
* వైఎస్ఆర్ నేతన్న నేస్తం - రూ.200 కోట్లు
* జగనన్న తోడు రూ.23 కోట్లు
* జగనన్న చేదోడు - రూ.300 కోట్లు
* ఈబీసీ నేస్తం - రూ.590 కోట్లు
* వైఎస్ఆర్ కాపు నేస్తం - రూ.500 కోట్లు
* వైఎస్ఆర్ రైతు భరోసా - రూ.3,900 కోట్లు
* పెన్షన్ కానుక - రూ.18 వేల కోట్లు
* మైనారిటీ సంక్షేమం - రూ.2,063 కోట్లు
* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - 15,846 కోట్లు
* రెవెన్యూశాఖ - రూ.5,306 కోట్లు
* వృత్తి నైపుణ్యం - రూ.969 కోట్లు
* సాంఘిక సంక్షేమం - రూ.12,728 కోట్లు
* రోడ్లు, భవనాలు - 8,581 కోట్లు
* మహిళా శిషు సంక్షేమం - రూ.4,382 కోట్లు
* వైద్య, ఆరోగ్యం - రూ.15,384 కోట్లు
* గృహ నిర్మాణం - 4,791 కోట్లు
* అటవీ శాఖ - రూ.685 కోట్లు
* ఉన్నత విద్య - రూ.2,014 కోట్లు
* సెకండరీ ఎడ్యుకేషన్ - రూ.22,706 కోట్లు
* ఈడబ్ల్యూఎస్ - రూ.10,201 కోట్లు
* పౌర సరఫరాల శాఖ - రూ.3,710 కోట్లు
* వార్డు వాలంటీర్లకు - రూ.3,396 కోట్లు
* నీటి పారుదల, వరదల నివారణ - రూ.11,482.37 కోట్లు
* సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ.11.78 కోట్లు
* రవాణా రంగం - రూ.9,617.15 కోట్లు
* ఏపీ బడ్జెట్ - రూ.2,56,257 కోట్లు
* రెవెన్యూ వ్యయం - రూ.2,08,261 కోట్లు
* మూలధన వ్యయం - రూ.47,996 కోట్లు
* రెవెన్యూలోటు - రూ.17,036 కోట్లు
* ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు
* జీఎస్డీపీ రెవెన్యూ లోటు - 1.27 శాతం
* జీఎస్డీపీ ద్రవ్య లోటు - 3.64 శాతం
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ 2022-23 ను ప్రవేశపెడుతున్నారు. ‘‘గొప్ప పాలకులు అనబడే వారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు.’’ అని తిరువళ్లువార్ సూక్తులను గుర్తు బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆ వెంటనే అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు. అంతకుముందు టీటీడీ వేదపండితులతో బడ్జెట్ కాపీలకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం 10:15 గంటలకు ఏపీ బడ్జెట్ 2022-23 అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను మండలిలో సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్, యానాంలో తక్కువ ఎత్తులో ప్రధానంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 3 రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. దక్షిణ కోస్తా, యానాం ప్రాంతాల్లో నూ వాతావరణ పొడిగానే ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాలకు సంబంధించిన గానీ, ఎండలకు సంబంధించిన గానీ ఎలాంటి హెచ్చరికలూ లేవు’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తూర్పు తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని జగ్గంపేట - తాడేపల్లిగూడం పరిధిలో, తెలంగాణ భద్రాచలం, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఈ ఎండల తీవ్రత ఉండగా, మనం నీటిని తాగడం చాలా మంచిది. మార్చి 13 నుంచి ఎండలు మరింత ఎక్కువ అవుతాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బాగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు బాగా తగ్గింది. కిలోకు ఏకంగా రూ.2,600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,580 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.74,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.76,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,100 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -